మహిళ ఆత్మహత్యాయత్నం | woman commit to suicide infront of police station | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Published Thu, Sep 7 2017 7:58 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

మహిళపై నీళ్లు పోస్తున్న పోలీసులు - Sakshi

మహిళపై నీళ్లు పోస్తున్న పోలీసులు

కేకే.నగర్‌: పుదుచ్చేరి పోలీస్‌స్టేషన్‌ ఎదుట బుధవారం మహిళ శరీరంపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు..  పుదుచ్చేరి లాస్‌పేట ప్రాంతానికి చెందిన వెనోనికా(35). ఈమె భర్త నుంచి విడాకులు పొందింది. ఈ స్థితిలో మంగళవారం సాయంత్రం పుదువై పోలీస్‌స్టేషన్‌ ప్రధాన కార్యాలయం ముందు వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడున్న పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకుని కిరోసిన్‌ క్యాన్‌ను లాక్కున్నారు.

పోలీస్‌స్టేషన్‌లో నుంచి క్యాన్‌లో నీళ్లు తెచ్చి మహిళపై పోశారు. అనంతరం ఆమె వద్ద విచారణ జరిపారు. విచారణలో సదరు మహిళ భర్త నుంచి విడాకులు పొందిన స్థితిలో లాస్‌పేట ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్‌ వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని తెలిపింది. దీనిపై లాస్‌పేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొంది. దీనిపై పెరియకడై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ కళ్లలో కిరోసిన్‌ పడి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement