అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మంగళవారం చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ భారీగా పట్టుబడింది.
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మంగళవారం చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ భారీగా పట్టుబడింది. స్థానిక ఆలూరు రోడ్డులోని హిందూ శ్మశానం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పీపాల్లో ఉంచిన సుమారు 4,500 లీటర్ల నీలి కిరోసిన్ ను నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.