గోదాములపై విజిలెన్స్ దాడులు | ration rice caught in ananthpur distirict | Sakshi
Sakshi News home page

గోదాములపై విజిలెన్స్ దాడులు

Published Tue, Jul 28 2015 9:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

ration rice caught in ananthpur distirict

గుంతకల్లు (అనంతపురం): అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని మహబూబ్‌నగర్ కాలనీలో జయన్న అనే వ్యక్తికి చెందిన గోదాముపై సోమవారం అర్థరాత్రి విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచిన  156 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు సురేష్‌బాబు, అనిల్ పాల్గొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement