రేషన్‌ బియ్యం పేరుతో మహిళల ఫోన్‌ నంబర్లు.. అర్థరాత్రి ఫోన్‌ చేసి | Anantapur Locals Beat Young Man Over Harassed Women In Phone | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పేరుతో మహిళల ఫోన్‌ నంబర్లు.. అర్థరాత్రి ఫోన్‌ చేసి

Published Wed, Nov 17 2021 8:10 AM | Last Updated on Wed, Nov 17 2021 8:11 AM

Anantapur Locals Beat Young Man Over Harassed Women In Phone - Sakshi

పామిడి: అర్ధరాత్రి సమయంలో మహిళలకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఆకతాయిని స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేశారు. వివరాలు.. పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అశోక్‌.. రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తానంటూ చాలా మంది మహిళల ఫోన్‌ నంబర్లు సేకరించుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అర్ధరాత్రి సమయంలో అపరిచిత నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తూ వేధించేవాడు. ఇటీవల మండల కేంద్రంలోని పామిడమ్మ వీధికి చెందిన మహిళకు అర్ధరాత్రి ఫోన్‌ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుటుంబసభ్యులు జోక్యం చేసుకుని మాట్లాడారు. 

మంగళవారం నెహ్రూ కాలనీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వద్ద అశోక్‌ని గుర్తించి, నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన బాధితులు ఒక్కసారిగా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో వారం రోజుల క్రితం పామిడిలోని మదీనా కాలనీలో ఓ మహిళపై అతను దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement