భర్తకు నిప్పంటించిన భార్య | wife burns her husbend and he's death | Sakshi
Sakshi News home page

భర్తకు నిప్పంటించిన భార్య

Published Sun, Jul 3 2016 2:28 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

wife burns her husbend and he's death

చికిత్స పొందుతూ మృతి

 దోమ:  ఓ మహిళ కుటుంబ కలహాలతో తన భర్త ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఖలీల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లగచర్ల ఆశప్ప(40), నర్సమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, భార్యాభర్తలు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గొడవపడ్డారు. ఘర్షణ పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నర్సమ్మ భర్త ఆశప్పపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గమనించిన కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన మృతిచెందాడు. మృతుడి తమ్ముడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement