తలకొండపల్లి, న్యూ స్‌లైన్: భర్త వేధింపులకు తాళలేక ఓ భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ని ప్పంటించుకుని ఆ త్మహత్యకు పాల్పడింది. ఈ సంఘట న మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెట్ల శ్రీను, పద్మలు భార్యాభర్తలు కాగా, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
పదేళ్లపాటు అన్యోన్యంగా సాగినవారి సంసారంలో సారా చిచ్చుపెట్టింది. ఆమె భర్త శ్రీను మద్యం తాగుడుకు బానిసయ్యాడు. పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండటంతో పాటు డబ్బు కోసం భార్య పద్మను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. తీవ్రమనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు తెరచి చూడగా ఆ అభ్యాగురాలు అప్పటికే సగం కాలిపోయింది. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు.
భర్త వేధింపులకు భార్య బలి
Published Mon, Dec 23 2013 3:33 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement