కిరోసిన్ పోసుకునీ సూపర్‌మార్కెట్‌కు దూసుకెళ్ళిన మహిళ
- తన కూతురి ఆచూకీ తెలపాలనీ ఆందోళన
- అడ్డుకున్న పోలీసులు
- ఉద్రిక్తత
తిరువళ్లూరు : తిరువళ్లూరులోనీ ప్రవేటు సూపర్‌మార్కెట్‌లో పని చేస్తూ గత 15న అదృశ్యమైన యువతి ఆచూకీ తెలపాలనీ కోరుతూ బందువులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తన కుమార్తేను సూపర్ మార్కెట్ యజమానీ బందువులే కిడ్నాప్ చేసారనీ ఆరోపించిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ సూపర్ మార్కెట్ లోపలికి దూసుకెళ్ళడంతో ఒక్క సారీగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానీకి చెందిన మునస్వామీ కుమార్తే సంధ్య. పట్టణంలోనీ అలీస్ సూపర్‌మార్కెట్‌లో సేల్స్ రంగంలో పని చేస్తూవుంది. ఈ నేపద్యంలో గత 15న ఇంటి నుండి పనికి వెళ్ళిన సంధ్య అప్పటి నుండి అదృశ్యమైయింది. ఈ సంగటనపై సంధ్య తల్లి అరసు సెవ్వాపేట పోలీసులకు పిర్యాదు చేసింది.
అయితే పిర్యాదు ఇచ్చి దాదాపు వారం రోజులు దాటుతున్న యువతి ఆచూకీనీ పోలీసులు కనిపెట్టకపోవడంతో ఆగ్రహించిన బంధువులు అలీస్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోనకు దిగారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుడి బందువుల అరుణ్ తన కుమార్తేను అపహరించాడనీ ఆరోపించిన అమే తల్లి అరస్ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ లోపలికి పరుగులు పెట్టింది. దీంతో ఒక్క సారీగా అక్కడ అరుపులు కేకలు వినిపించింది. తన కుమార్తే అచూకీ తెలిపే వరకు తాము ఆందోళననూ విరమించేదీ లేదనీ తేల్చిచెప్పడంతో పోలీసులు వారినీ సముదాయించే ప్రయత్నం చేసారు.
ఈ దశలో పోలీసులకు యువతి బందువుల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇక లాభం లేదనకున్న పోలీసులు సూపర్‌మార్కెట్ నిర్వాహకులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో సూపర్‌మార్కెట్‌లో పని చేసే అరుణ్ అనే యువకుడితో వెళ్ళిపోయినట్టు నిర్దారించారు. రెండు రోజుల్లో యువతినీ అప్పగిస్తామనీ హమీ ఇవ్వడంతో సూపర్‌మార్కెట్ నిర్వాహులు హమీ ఇవ్వడంతో వారు శాతించారు. ఇది ఇలా వుండగా పరారైన సంధ్యకు గత రెండు నెలల క్రితం వేరే యువకుడితో నిశ్చితార్ధం అయినట్టు తెలిసింది.