కోరిక తీర్చనందుకే... | Radhamma left the murder mystery | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చనందుకే...

Published Fri, Jun 3 2016 4:09 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కోరిక తీర్చనందుకే... - Sakshi

కోరిక తీర్చనందుకే...

వీడిన రాధమ్మ హత్య కేసు మిస్టరీ
నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపర్చిన ఎమ్మిగనూరు పోలీసులు
 

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కురువ గంగప్ప భార్య కురువ రాధమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది.  బావ కుమారుడు కురువ నాగరాజు తన కోరిక తీర్చమని ఆమెను కోరగా.. అందుకు నిరాకరించినందుకే కుటుంబ సభ్యులంతా కలసి కడతేర్చినట్లు పోలీసులు విచారణ లో తేల్చారు. బనవాసి ఫోరం సమీపంలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న నిందితులు కురువ  నాగరాజు, కురువ గంగప్ప, కురువ లింగమ్మ,  నరసింహులు, కురువ అయ్యమ్మ, కురువ ఈరన్నను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరపరిచారు.

ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ శ్రీనివాసమూర్తితో కలసి వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. పత్తికొండ గ్రామానికి చెందిన రాధమ్మకు మల్కాపురం గ్రామానికి చెందిన గంగప్పతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన సంవత్సరం నుంచే భర్తతో పాటు కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. మూర్ఛ రోగముంది... సంసారానికి సరిపోవు.. అంటూ వేధించేవారు. ఈ విషయంలో చాలాసార్లు ఇరువురికి చెందిన పెద్దలు పంచాయితీ కూడా చేశారు. గత నెల 29వ తేదీన రాధమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా, ఆమె బావ కుమారుడు నాగరాజు కోరిక తీర్చమని చేయి పట్టుకోగా కేకలు వేసింది. దీంతో ఇంట్లో వారంతా గుమికూడారు.

అనవసరంగా చిన్నపిల్లవాడిపై నింద మోపుతున్నావంటూ ఆమె ను కొట్టి మానసికంగా హింసించారు. ఇదే విషయాన్ని పుట్టింటి వారికి చెప్పి పంచాయితీ పెడతానని రాధమ్మ హెచ్చరించిం ది. ఆ మరుసటి రోజు బావ నర్సింహు లు, ఆయన భార్య అయ్యమ్మ, కుమారుడు నాగరాజు, అత్త లింగమ్మ, మామ ఈరన్న కలసి ఇంట్లో ఉన్న రాధమ్మపై  కిరోసిన్ పోసి నిప్పం టించారు. తీవ్ర గాయాలైన ఆమె ను ఆసుపత్రి చేర్పించగా చికి త్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందిం ది. మూడు రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన సీఐ శ్రీనివాసమూర్తితో పాటు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement