ఖమ్మం(కొణిజర్ల): అక్రమంగా తరలిస్తున్న 1500 లీటర్ల కిరోసిన్‌ను సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం ఉదయం ఖమ్మ జిల్లా, కొణిజర్ల మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని గుబ్బగుర్తి గ్రామానికి చెందిన కిరోసిన్ హాకర్ రేషన్ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఖమ్మంలోని ఓ వ్యక్తికి అమ్ముకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి కిరోసిన్ తరలిస్తుండగా దారిలో పట్టుకున్నారు. సదరు హాకర్‌పై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.