నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వృద్ధురాలి బంధువులు మాత్రం ఆమెకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్నారు.
(సూర్యాపేట)