ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్‌? | After LPG, govt plans to reduce subsidy on kerosene | Sakshi
Sakshi News home page

ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్‌?

Published Thu, Aug 3 2017 2:08 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్‌? - Sakshi

ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్‌?

ముంబై: ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం  తీసుకోనుంది. కిరోసిన్‌పై సబ్సిడీ కొనసాగించేందుకు సానుకూలంగా లేని ప్రభుత్వం క్రమంగా దీన్ని ఎత్తివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.   ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ కోత మాదిరిగానే  కిరోసిన్‌ పై  సబ్సిడీని  కూడా తగ్గించాలని యోచిస్తోంది.  ఇంధనాల మార్కెట్ ధరలను సమాజంలోని పేద వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే లక్ష్యంతో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  పనిచేస్తున్నారని అధికారులు చెప్పినట్టు తెలిపింది.   
 
సబ్సిడీ కిరోసిన్ ధరలను  ప్రతి పదిహేను రోజులకు 25 పైసలు పెంచాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా సబ్సిడీని తొలగించేంత వరకు, లేదా  తదుపరి ఆదేశాల వరకు దీన్ని అమలు చేయాలని కోరింది. సబ్సిడీల్లో కోత పెట్టి  వినియోగ వస్తువుల ధరలను మార్కెట్‌ ధరల స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎల్‌పీజీ కు మారడానికి వినియోగదారులను ప్రోత్సహించడంతోపాటు, కాలుష్యం నివారణలో భాగంగా  ఈ నిర్ణయం తీసుకుంది.   అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు  దీనిపై భారీ సబ్సిడీ అమలు చేస్తున్న డిమాండ్‌  గణనీయంగా తగ్గింది.  2016-17లో 66 శాతం క్షీణించిన కిరోసిన్‌ వినియోగం 78,447 లీటర్లకు  పడిపోయింది.
 
కాగా మార్చి 2018 నాటికి  వంటగ్యాస్‌  సిలిండర్‌పై సబ్సిడీని  పూర్తిగా ఎత్తివేసే వ్యూహంలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ .4 చొప్పున పెంచాలని జూలై 31 న  ప్రభుత్వం ఆదేశించిన చమురు కంపెనీలకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం, ఢిల్లీ,  చండీగఢ్ కిరోసిన్ ఫ్రీ నగరాలుగా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement