ఏపీలో నాలుగో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభం | Free Ration Rice Distribution Began In Andhra Pradesh on Saturday | Sakshi
Sakshi News home page

ఏపీలో నాలుగో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభం

Published Sat, May 16 2020 8:35 AM | Last Updated on Sat, May 16 2020 8:40 AM

Free Ration Rice Distribution Began In Andhra Pradesh on Saturday - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్‌ పంపిణీ శనివారం ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని 28, 354 రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపీణీ చేయనున్నారు. రేషన్‌ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్‌ కూపన్లు అందజేయనున్నారు. కాగా కార్డుదారలకు బయో మెట్రిక్‌ తప్పనిసరి కావడంతో రేషన్‌ షాప్‌ కౌంటర్ల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అయితే రేషన్‌ పోర్టబిలిటీ ఎక్కడ ఉంటే రేషన్‌ అక్కడే లభించనుంది. దీని ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఇందులో బియ్యంకార్డు ఉన్న కుటుంబాలు 1,47,24,017 ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862 ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement