
ముంబై: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లలో వంట చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి స్పందిస్తూ.. ‘టాయిలెట్లలో వంట చేస్తే తప్పేంటి. టాయిలేట్ సీట్‌కు, స్టవ్‌కు మధ్య విభజన ఉంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ఇళ్లలో అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. అంతమాత్రాన ఇంటికి వచ్చిన బంధువులు భోజనం చేయడం మానేయడం లేదు కదా. ప్రస్తుతం ఆ బాత్రూంను వినియోగించడం లేదు. దాన్ని గులకరాళ్లతో నింపేశారు. అలాంటప్పుడు పాత్రలను బాత్రూం సీట్ మీద ఉంచితే ఏం అవుతుంది. మన ఇళ్లలో కూడా పాత్రలను కిందే పెడతాం కదా’ అన్నారు.
ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు ఇమర్తి దేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారే టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment