imarti
-
ఆమె ఓ ఐటెం..!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ఇమార్తీ దేవిపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నవంబర్ 3వ తేదీన రాష్ట్రంలోని 28 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఇమార్తీదేవి కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కమల్‌నాథ్.. తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి కాగా, ప్రత్యర్థి (బీజేపీకి చెందిన ఇమార్తీ దేవి) ‘ఐటెం’ అంటూ తూలనాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. దళిత మంత్రిని కించపరిచేలా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కమల్ వ్యాఖ్యలకు నిరసనగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సిందియా తదితరులు సోమవారం రెండు గంటల మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌పై చర్య తీసుకోవాలని సీఎం చౌహాన్.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. దళిత మహిళల హక్కుల కోసం తరచూ గళమెత్తుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కమల్‌నాథ్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు. హరిజన మహిళను గౌరవించడం తెలియని కమల్‌నాథ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఇమార్తీ దేవి కాంగ్రెస్ పార్టీని కోరారు. సీఎం పదవి కోల్పోయాక కమల్ మతి తప్పిందని ఇమార్తీ అన్నారు. కమల్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. ఆయనకు నోటీసులు జారీ చేయడంతోపాటు తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. సమగ్ర నివేదిక కోరిన ఈసీ ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. ‘ఈ అంశంపై మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇప్పటికే నివేదిక అందజేశారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. మంగళవారం అందే నివేదికను బట్టి ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం పరిశీలిస్తాం’అని తెలిపింది. -
‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’
ముంబై: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లలో వంట చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి స్పందిస్తూ.. ‘టాయిలెట్లలో వంట చేస్తే తప్పేంటి. టాయిలేట్ సీట్‌కు, స్టవ్‌కు మధ్య విభజన ఉంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ఇళ్లలో అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. అంతమాత్రాన ఇంటికి వచ్చిన బంధువులు భోజనం చేయడం మానేయడం లేదు కదా. ప్రస్తుతం ఆ బాత్రూంను వినియోగించడం లేదు. దాన్ని గులకరాళ్లతో నింపేశారు. అలాంటప్పుడు పాత్రలను బాత్రూం సీట్ మీద ఉంచితే ఏం అవుతుంది. మన ఇళ్లలో కూడా పాత్రలను కిందే పెడతాం కదా’ అన్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు ఇమర్తి దేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారే టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం’ అన్నారు. -
అమ్మో! ఎంత పేద్ద జిలేబీయో!!
ముంబై: స్వీటు ప్రియులకు సంతోషం కలిగించే వార్త ఇది. ప్రపంచంలోనే పెద్ద జిలేబీ మనదేశంలోనే తయారైంది. ముంబైలోని సంస్కృతి రెస్టారెంట్ భారీ జిలేబీ తయారు చేసింది. దీని బరువు అక్షరాల 18 కేజీలు. 9 అడుగుల వ్యాసార్థంతో దీన్ని రూపొందించారు. 12 మంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఇందుకోసం 1000 లీటర్ల పంచదార పాకం, 3500 కేజీల నెయ్యి వినియోగించారు. దీంతో 8.2 అడుగుల వ్యాస్థారంతో గతంలో రూపొందించిన జిలేబీ రికార్డు బద్దలైంది. ఇదే బృందం 37 కిలోల జాంగ్రీ తయారు చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఈ రికార్డును స్వయంగా వీక్షించారు. భారీ స్వీట్లు తయారు చేసేందుకు 100 రోజుల పాటు రోజుకు 20 గంటల పాటు సాధన చేశామని సంస్కృతి రెస్టారెంట్ ముఖ్య వంటగాడు గౌరవ్ చతుర్వేది వెల్లడించారు.