సాక్షి, అమరావతి : అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వంలో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాసిరకంగా ఇచ్చారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పౌష్టికాహారం కూడా నాసిరకంగా అందించి అవినీతికి పాల్పడ్డారు. కానీ నేడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. పిల్లలు, గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
రాష్ట్రంలో 53శాతం మహిళలకు రక్తహీనత ఉంది. దానిని తగ్గించేందుకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆహారం బిల్లులు కూడా పెండింగ్ పెట్టి వెళ్లిపోయారు. వీటన్నిటిని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మహిళా పక్షపాతిగా సీఎం జగన్ పాలిస్తున్నారు. మద్యం ధరలు పెంచి మద్యాన్ని పేదలకు దూరం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలంతా స్వాగతిస్తున్నారు. కానీ ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా'రని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment