
అంగన్‌వాడీ సెంటర్.. ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్‌వాడీ సెంటర్‌లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్‌వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు.
అంగన్‌వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు.
ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment