omlet issue
-
అంగన్వాడీ సెంటర్లో ఆమ్లెట్ దొంగలు!
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు. అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు. ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
ప్రాణం తీసిన 60 రూపాయల ఆమ్లెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమ్లెట్ కోసం తలెత్తిన గొడవ ఓ మనిషి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన వికాస్(34)ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి దాటాక తన స్నేహితుడు బబ్లూతో కలిసి మద్యం సేవించడానికి ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్ కు వెళ్లి అక్కడ మద్యం సేవిస్తూ ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. అయితే దానికి 60 రూపాయలు చెల్లించమని సిబ్బంది కోరగా, అందుకు స్నేహితులిద్దరూ అంగీకరించలేదు. మద్యం మత్తులో ఉన్నవారు డబ్బులు ఇవ్వమని సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో షాపు సిబ్బంది వారిపై దాడి చేయగా, వికాస్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో స్నేహితుడు బబ్లూ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఆస్పత్రిలో చేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (షాకింగ్ : అల్లాకోసం కన్న కొడుకు ‘బలి’) (బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది) -
ఆమ్లెట్ వెయ్యలేదని..
కేపీహెచ్‌బీకాలనీ: ఆమ్లెట్ వెయ్యలేదని భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లోని ఎంఐజీకి చెందిన రేవడ మహేష్ (24), వనజ దంపతులు. వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న మహేష్ మంగళవారం రాత్రి మద్యం ఇంటికి వచ్చి భార్య వనజను ఆమ్లెట్ వేసివ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీందో వనజ ఫ్లాట్ ఓనర్‌కు ఈ విషయం చెప్పి వారి ఇంట్లోకి వెళ్లింది. కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చి తలుపు కొట్టగా మహేష్ తలుపు తీయయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వచ్చి తలుపు పగుల గొట్టి చూడగా మహేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమ్లెట్ పెట్టలేదని.. భార్యకు నిప్పంటించాడు!
హైదరాబాద్: తాగిన మైకంలో ఉన్న ఓ భర్త.. తాను ఆమ్లెట్ అడిగితే పెట్టలేదన్న కోపంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఉదంతంలో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దుర్ఘటన పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధి బాలాపూర్ రోషన్‌ద్దాలా ప్రాంతంలో జరిగింది. ఆకపోగు సదేశమ్మ(30), నరేష్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా అయిన నరేష్ కొన్నాళ్లుగా తాగుడుకు బానిసై భార్యను వేధిస్తున్నాడు. తాగిన మైకంలో ఉన్న నరేష్.. సదేశమ్మను ఆమ్లెట్ వేయమన్నాడు. ఆమె వేసినా, చిన్న కొడుకు శామ్యూల్ అడగడంతో అతడికి ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన నరేష్ పక్క గదిలో ఉన్న కిరోసిన్‌ను తీసుకొచ్చి భార్య ఒంటిపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకూ వారు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. 96 శాతం గాయపడిన సదేశమ్మ చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను వేధించేవారని సదేశమ్మ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.