కేపీహెచ్‌బీకాలనీ: ఆమ్లెట్ వెయ్యలేదని భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లోని ఎంఐజీకి చెందిన రేవడ మహేష్ (24), వనజ దంపతులు. వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న మహేష్ మంగళవారం రాత్రి మద్యం ఇంటికి వచ్చి భార్య వనజను ఆమ్లెట్ వేసివ్వాలని కోరాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీందో వనజ ఫ్లాట్ ఓనర్‌కు ఈ విషయం చెప్పి వారి ఇంట్లోకి వెళ్లింది. కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చి తలుపు కొట్టగా మహేష్ తలుపు తీయయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వచ్చి తలుపు పగుల గొట్టి చూడగా మహేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment