సాక్షి, హైదరాబాద్ : ఆమ్లెట్ కోసం తలెత్తిన గొడవ ఓ మనిషి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన వికాస్(34)ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి దాటాక తన స్నేహితుడు బబ్లూతో కలిసి మద్యం సేవించడానికి ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్ కు వెళ్లి అక్కడ మద్యం సేవిస్తూ ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. అయితే దానికి 60 రూపాయలు చెల్లించమని సిబ్బంది కోరగా, అందుకు స్నేహితులిద్దరూ అంగీకరించలేదు.
మద్యం మత్తులో ఉన్నవారు డబ్బులు ఇవ్వమని సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో షాపు సిబ్బంది వారిపై దాడి చేయగా, వికాస్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో స్నేహితుడు బబ్లూ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఆస్పత్రిలో చేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment