సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహార పదార్థాలు కల్తీమయ మవుతున్నాయి. ఇటీవల అధికార యంత్రాంగం అంతర్గత తనిఖీల్లో ఇది వెలుగుచూసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు బా లామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్ ఇస్తున్నారు. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ ఫుడ్స్ విభాగం తయారు చేసి అంగన్‌వా డీలకు సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్‌వాడీ, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింత లు, 10,42,675 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 6,54,165 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ముడిసరుకుల సరఫరా కాంట్రాక్టర్లదే..
ఈ ఆహార పదార్థాల తయారీకి ముడిసరుకును ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ఎస్‌ృ30 షుగర్, శనగపప్పు, మొక్కజొన్న, కారం, పసుపు, గోధుమలు తదితరాలను కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని బాలామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్‌ను తయారు చేసి అంగన్‌వాడీలకు సరఫరా చేస్తారు. అయితే ఈ సరుకులను ప్యాకేజీ రూపంలో పంపిణీ చేస్తుండగా.. చాలా వరకు కల్తీ ఉంటోందని తెలిసింది. కాగా, ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాఖ పరమైన కార్యక్రమాల్లో భాగంగా తయారీ కేంద్రాన్ని, ఇతర హోమ్‌లను సందర్శించిన సందర్భంలో సరుకుల నాణ్యతలో లోపాలను గుర్తించారు.
థర్డ్ పార్టీ ద్వారా విచారణ..
ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తు న్న సరుకుల నాణ్యతను పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకుల శాంపిల్స్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
గడువు దాటినా తెరుచుకోని టెండర్లు
తెలంగాణ ఫుడ్స్ విభాగానికి ముడిసరుకుల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 11న తెలంగాణ ఫుడ్స్ ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించిగా.. మళ్లీ ఈ కాంట్రాక్టర్లే టెండర్లు వేసినట్లు తెలిసింది. గత నెల 31తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. వాస్తవానికి ఈ నెల 1న టెండర్లు తెరవాల్సి ఉంది. కానీ సరుకుల నాణ్యతపై ఆందోళన కలగడంతో వాటిని తెరవొద్దని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. థర్డ్ పార్టీ నివేదిక వచ్చాక కాంట్రాక్టర్ల ఎంపిక చేపట్టాలని, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలా? లేక క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలా? అనే దానిపై నిర్ణ యం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు.
పిల్లల బువ్వ కల్తీ.. హవ్వ!
Published Thu, Nov 14 2019 3:07 AM | Last Updated on Thu, Nov 14 2019 3:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment