Telangana Foods
-
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా రాజీవ్‌సాగర్
సాక్షి, హైదరాబాద్: స్త్రీ, శిశు, వికలాంగ, వయోజన సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీ వ్‌సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్ల పదవీ కాలంతో వీరి నియామకాలను ప్రకటిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. ►సూర్యాపేట జిల్లాకు చెందిన మేడే రాజీవ్‌సాగర్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశారు. 2006–2008 వరకు తెలం గాణ జాగృతి కోశాధికారిగా, 2008 నుంచి 2014 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ►కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్, బీఏ, ఎల్ఎల్బీ చదివారు. టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇదివరకు రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ గా, టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్‌గా పదవులను నిర్వహించారు. ►మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన శ్రీదేవి బీఎస్సీ చదివారు. -
మోదీకి యాదమ్మ మెనూ
‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే కాల్ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ మామిడి పచ్చడి, శ్రీఖండ్ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది. గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు ‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ. జీవితం చెదిరినా రుచి కుదిరింది ‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్ బస్సెక్కా. కొన్నాళ్లు స్కూల్ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు. నాటుకోడి... నల్ల మాంసం ‘నేను తెలంగాణ నాన్‌వెజ్ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్ అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్ చేసుకుంటూ’ అందామె. వేములవాడ నుంచి పుష్కరాల దాకా ‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్ కితాబిచ్చారు’ అందామె. ఇంటికి పెద్దకొడుకయ్యా ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు. తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె. ఒంటరి మహిళలకు భయం వద్దు ‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె. యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? – భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి -
బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఫైవ్ స్టార్ హోటల్ ప్రధాన షెఫ్‌లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాల పాఠాలు నేర్చుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ ఇన్చార్జీ, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు బుధవారం వంట ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా వంటకాలు, కావాల్సిన సామగ్రి గురించి నోవాటెల్–హెచ్ఐసీసీ షెఫ్‌లు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సభ కోసం సర్వపిండి, ముద్ద పప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, పల్ల పులుసు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసంతోపాటు మరికొన్ని రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. -
నాణ్యత అక్కర్లేదా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు అటకెక్కాయి. నాసిరకం సరుకులను కాంట్రాక్టు సంస్థ సరఫరా చేస్తుందనే అభియోగాలను అధికారులు అట్టిపెట్టారు. వాటిపై నిజానిజాలు తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వేసిన థర్డ్ పార్టీ ఎంక్వైరీ విచారణ ప్రక్రియకే పరిమితమైంది. కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగుస్తుందన్న సాకుతో టీఎస్ ఫుడ్స్ అధికారులు థర్డ్ పార్టీ నివేదిక కోసం వేచి చూడకుండా.. నిజాలు తేలే వరకు టెండర్లు తెరవొద్దని మంత్రి తేల్చిచెప్పినా కూడా అధికారగణం మాత్రం టెండర్లు తెరిచేందుకే మొగ్గు చూపింది. టీఎస్ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాకు వచ్చిన టెండర్లను అధికారులు సోమవారం తెరిచారు. ఇందులో సాంకేతిక పరమైన అంశాలను మాత్రమే పరిశీలించినట్లు తెలిసింది. కాగా, ముడిసరుకుల కాంట్రాక్టు సంస్థను ఈనెల 29న ఖరారు చేస్తారు. సోమవారం సాంకేతిక అంశాలను పరిశీలించిన టీఎస్ ఫుడ్స్ అధికారులు 29న ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో తక్కువ ధరలు కోట్ చేసి ఎల్1ని గుర్తించిన సంస్థకు కాంట్రాక్టు బాధ్యతను అప్పగిస్తారు. తాజా టెండర్ల ప్రక్రియలో కొన్ని ప్రధాన సంస్థలే టెండర్లు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పాల్గొన్న సంస్థలే ఈసారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. గతంలో అనుసరించిన వ్యూహాల ప్రకారమే ఈసారి కూడా టెండర్ల ప్రక్రియ జరిగిందని, గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే టెండర్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అంతా సిండికేటుదే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇస్తున్న బాలామృతం, న్యూట్రీమిక్స్, స్నాక్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలన్నీ తెలంగాణ ఫుడ్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటి తయారీకి అవసరమై న ముడిసరుకును టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థ నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ముడిసరుకులను సరఫరా చేసే కాంట్రాక్టులో నాలుగైదు సంస్థలే కీలకంగా ఉంటున్నాయి. దాదాపు పన్నెండేళ్లుగా ఈ సంస్థలే టెండర్లు దక్కించుకుంటున్నాయి. ఈ సంస్థలే సిండికేట్‌గా మారి టెండర్లు వేస్తున్నాయని, అందుకే ఆ సిండికేటులోని సంస్థలే ఏటా కాంట్రాక్టు దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ నాణ్యతపై ఫిర్యాదులు అందడం తో మంత్రితో పాటు అధికారులు సీరియస్ అయ్యారు. -
పిల్లల బువ్వ కల్తీ.. హవ్వ!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహార పదార్థాలు కల్తీమయ మవుతున్నాయి. ఇటీవల అధికార యంత్రాంగం అంతర్గత తనిఖీల్లో ఇది వెలుగుచూసింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు బా లామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్ ఇస్తున్నారు. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ ఫుడ్స్ విభాగం తయారు చేసి అంగన్వా డీలకు సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింత లు, 10,42,675 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 6,54,165 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముడిసరుకుల సరఫరా కాంట్రాక్టర్లదే.. ఈ ఆహార పదార్థాల తయారీకి ముడిసరుకును ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ఎస్‌ృ30 షుగర్, శనగపప్పు, మొక్కజొన్న, కారం, పసుపు, గోధుమలు తదితరాలను కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని బాలామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్‌ను తయారు చేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తారు. అయితే ఈ సరుకులను ప్యాకేజీ రూపంలో పంపిణీ చేస్తుండగా.. చాలా వరకు కల్తీ ఉంటోందని తెలిసింది. కాగా, ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాఖ పరమైన కార్యక్రమాల్లో భాగంగా తయారీ కేంద్రాన్ని, ఇతర హోమ్‌లను సందర్శించిన సందర్భంలో సరుకుల నాణ్యతలో లోపాలను గుర్తించారు. థర్డ్ పార్టీ ద్వారా విచారణ.. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తు న్న సరుకుల నాణ్యతను పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకుల శాంపిల్స్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గడువు దాటినా తెరుచుకోని టెండర్లు తెలంగాణ ఫుడ్స్ విభాగానికి ముడిసరుకుల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 11న తెలంగాణ ఫుడ్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించిగా.. మళ్లీ ఈ కాంట్రాక్టర్లే టెండర్లు వేసినట్లు తెలిసింది. గత నెల 31తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. వాస్తవానికి ఈ నెల 1న టెండర్లు తెరవాల్సి ఉంది. కానీ సరుకుల నాణ్యతపై ఆందోళన కలగడంతో వాటిని తెరవొద్దని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. థర్డ్ పార్టీ నివేదిక వచ్చాక కాంట్రాక్టర్ల ఎంపిక చేపట్టాలని, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలా? లేక క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలా? అనే దానిపై నిర్ణ యం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. -
చవులూరిస్తున్న ‘తెలంగాణ స్పైసీ కిచెన్’
చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ చేసిన వంటకాలు గుర్తొస్తే ఇప్పటికీ నోరూరుతూ ఉంటుంది. మళ్లీఆ రుచుల కోసం నాలుక తహతహలాడుతూ ఉంటుంది. మరి ఆనాటిఆ వంటకాలను రుచి చూడాలంటే పల్లెకు పరుగెత్తాల్సిందే. అలాంటి గ్రామీణ వంటకాలను సిటీ ప్రజలకు అందిస్తుంది‘తెలంగాణ స్పైసీ కిచెన్’రెస్టారెంట్. ఓసారి ఇక్కడికి మనమూ వెళ్లొద్దామా..ఆ రుచులను ఆస్వాదిద్దామా.. హిమాయత్‌నగర్ : కరీంనగర్‌కు చెందిన ‘రోహిత్‌రావు, వికాస్‌రావు, హర్ష, ఉదయ్’లు బంధువులు, స్నేహితులు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రసిద్ధి చెందిన వంటకాలతో నగరంలో రెస్టారెంట్‌ను పెట్టాలనుకున్నారు. ఈ ఏడాది మే 28న జూబ్లిహిల్స్‌లో ‘తెలంగాణ స్పైసీ కిచెన్’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక్కడ ముద్దపప్పు, పచ్చి పులుసు ఎంతో రుచికరంగా తయారుచేస్తున్నారు. వీటికోసం టెక్కీలు బారులు తీరడం విశేషం. అలాగే ‘గోలించిన మాంసం, మక్క గారెలు విత్ కంట్రీ చికెన్, దాల్చా మటన్ విత్ బగారా రైస్, పులిహోర విత్ కంట్రీ చికెన్’ వంటకాలను అందిస్తున్నారు. అలాగే కరీంనగర్‌లోనే ప్రత్యేకంగా లభించే ‘చికెన్ ఫ్రైడ్ వింగ్స్’ టేస్టీకి ఫిదా కావాల్సిందే. -
పల్లె రుచులకు పట్టం
కాజీపేట అర్బన్: బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌లపై మోజు పెంచుకుంటున్న నేటి కాలంలో సంప్రదాయ వంటలకు పట్టాభిషేకం చేస్తున్నారు ఓరుగల్లు వనితలు. కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు. వరంగల్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, ఇతర దేశాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నలుగురు మహిళలతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 30మంది ఉపాధి దుతున్నారు. దినదినాభివృద్ధి చెందతూ ప్రగతి పథంలో పయనిస్తున్న వరంగల్ హంటర్‌రోడ్డులోని ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ సంస్థపై ప్రత్యేక కథనం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వర్‌రావు, రాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రమ, ఉమ, ఉష, కుమారుడు భీంరావ్ ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో తల్లి చేసిన వంటలను ఆస్వాదించిన కుమార్తెలు నేటి తరానికి బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌కు దీటుగా సంప్రదాయ తెలంగాణ పిండి వంటకాలను పరిచయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు, మరదలు అర్చన(తమ్ముడి భార్య) కలిసి 2016 మే 2న ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ అనే సంస్థను ప్రారంభించారు. నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది ఉపాధి పొందుతున్నారు. వరంగల్ నుంచి విదేశాలకు... శ్రీనిధి సంస్థ ఉత్పత్తులను నగరంతోపాటు దేశవిదేశాల్లోని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. బెంగుళూరు, ముంబాయి, చెన్సై, నగరాలతోపాటు ఆస్టేలియా, అమెరికా వంటి దేశాలకు ఆర్డర్లపై పిండి వంటలను సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్లు.. శ్రీనిధి తెలంగాణ పిండి వంటల కోసం ఆన్లైన్లో జస్ట్ డైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఆన్లైన్లో శ్రీనిధి ఆర్డర్ కోసం 98494 03242, 93949 46666 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. రకరకాల రుచులు రుచిలో తేడా రాకుండా వంటలకు సంబంధించి కారం పొడి, పసుపు, ఇతర పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. పల్లి గారెలు, పçప్పు గారెలు, తెల్ల సకినాలు, కారం సకినాలు, చెగోడీలు, మురుకులు, బూందీ కార, మడుగులు, సర్వపిండి, అరిసెలు, బూందీ లడ్డూ, బాదుషా, గవ్వలు, పల్లి, నువ్వుల లడ్డూ, గరిజెలు, సున్నుండలతోపాటు, పచ్చళ్లను సైతం తయారు చేస్తున్నారు. పిండి వంటలు కిలోకు రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తున్నారు. ఆర్డర్ ఇస్తే చాలు.. వివాహాది శుభకార్యాల సందర్భంగా పిండి వంటలు కావాల్సిన వారు రెండు రోజుల ముందు ఆర్డర్ ఇస్తే చాలు సరఫరా చేస్తాం. తెలంగాణ పిండి వంటలకు నగరంలో మంచి డిమాండ్ ఉంటోంది. రుచికరమైన పిండి వంటలను అందించేందుకు స్వయంగా పప్పులు, కారం, పసుపును గిర్నీలో పట్టిస్తున్నాం. వంటల తయారీలో వంద శాతం, నాణ్యత, శుభ్రత పాటిస్తున్నాం. - రమ, సంస్థ ప్రతినిధి చాలా ఆనందంగా ఉంది నేను నా పిల్లలు చేస్తున్న వంటలకు ఆదరణ లభిస్తుండడంతో ఆనందంగా ఉంది. మా వద్ద మరో 30 మంది గృహిణులు ఉపాధి పొందుతున్నారు. నేటి తరానికి సంప్రదాయ వంటకాలు తప్పనిసరిగా పరిచయం చేయాలి. తెలంగాణ పిండి వంటలు రుచితోపాటు బలాన్ని ఇస్తాయి. – రాధ, సంస్థ నిర్వాహకులు వనమాలకనపర్తి నుంచి వస్తా.. ఐనవోలు మండలంలోని వనమాలకనపర్తి నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా. పిండి వంటలు తయారు చేసి ఉపాధి పొందడం బాగుంది. నిర్వాహకులు సొంత మనుషుల్లా చూసుకుంటారు. మేం చేసే వంటలకు గిరాకీ పెరుగుతోంది. – కళ, కార్మికురాలు సొంత ఇంట్లో ఉన్నట్లుగానే శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ప్రారంభించి నాటి నుంచి ఇక్కడ పని చేస్తున్నా. ఇంట్లో ఉండి పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది. నాకు పూర్వ అనుభవం ఏమీ లేకున్నా నిర్వాహకులు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం ఆనందంగా ఉంది. – దేవి, కార్మికురాలు. అమ్మ స్ఫూర్తితో.. అమ్మ స్ఫూర్తితో ప్రారంభించిన మా సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌లకు దీటుగా పిండి వంటలను పిల్లలకు అందించాలి. ప్రతిరోజు సుమారు 60 నుండి 100 మందికి పైగా కస్టమర్లు మా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో ఆర్డర్లపై పిండి వంటలను అందిస్తున్నాం. – ఉమ, సంస్థ ప్రతినిధి -
సర్కారుకు ఐటీ చిక్కులు!
♦ అలసత్వంతో మూల్యం చెల్లించిన ప్రభుత్వం ♦ రూ.1,274 కోట్లు పోయాక ఉరుకులు పరుగులు ♦ టీఎస్‌బీసీఎల్‌పై నెల రోజులుగా న్యాయశాఖలోఆగిన ఫైలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేయటంతోపాటు గడువులోగా కోర్టును ఆశ్రయించకపోవటంతో భారీ మూల్యం చెల్లించుకుంది. తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) బకాయిల కింద ఐటీ శాఖ ఏకంగా రూ.1,274 కోట్లు నేరుగా ఆర్బీఐ నుంచి సీజ్ చేసుకుంది. గడువులోగా చెల్లించలేదని, తాము నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదనే కారణంతో ఈ చర్య తీసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తెలంగాణ ఆర్థిక శాఖ బిత్తరపోయింది. హుటాహుటిన మంత్రి కె.తారకరామారావు అధ్వర్యంలోని బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసింది. అయితే ఐటీ సీజ్ చేసిన నిధులు తిరిగి వచ్చే అవకాశం లేదు. గ్రాంట్లు లేదా నిధుల రూపంలో ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి సాయం ఆశించటం తప్ప ఐటీ సీజ్ చేసిన డబ్బు వెనక్కి రావటం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఎందుకిలా జరిగింది..? మార్చి నెలలోనే తమ పన్ను బకాయిలు చెల్లించాలంటూ టీఎస్‌బీసీఎల్ పరిధిలోని మద్యం డిపోలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 2012-14 వరకు రెండేళ్లకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులిచ్చారు. ఏపీబీసీఎల్‌కు ఇచ్చిన నోటీసులు తమకు వర్తించవంటూ తెలంగాణ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉందని, టీఎస్‌బీసీఎల్ అనే సంస్థ లేనే లేదని వాదించింది. ఆ నోటీసులపై వెంటనే స్టే ఇచ్చిన హైకోర్టు... ఏపీబీసీఎల్, టీఎస్‌బీసీఎల్ మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల తర్వాత బకాయిలు వసూలు చేసుకోవచ్చంటూ ఐటీ విభాగానికి సూచించింది. దీంతో ఐటీ అధికారులు మళ్లీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా నోటీసులిచ్చారు. తెలంగాణ సర్కారు ఈ నోటీసులపై ఇప్పటికీ స్పందించలేదు. మరోసారి కోర్టులో సవాలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తూ ఆర్థిక శాఖ ఈ ఫైలును న్యాయ శాఖకు, అక్కణ్నుంచి అడ్వకేట్ జనరల్‌కు పంపించింది. నెల రోజులు గడిచినా పిటిషన్ దాఖలు చేయకపోవటంతో ఐటీ శాఖ నిధుల జప్తుకు సిద్ధపడింది. టీఎస్‌బీసీఎల్ తరహాలోనే తెలంగాణ ఫుడ్స్ కూడా ఐటీ చిక్కుల్లో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫుడ్స్‌గా ఉన్నప్పుడు సెక్షన్ 10 కింద ఈ కార్పొరేషన్‌కు ఐటీ మినహాయింపు ఉంది. కానీ దీన్ని ఆర్థిక లావాదేవీల వ్యాపారంగా చూపించటంతో తెలంగాణ ఫుడ్స్‌కు ఐటీ విభాగం ఈ సెక్షన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు నోటీసులు జారీ చేసింది. దీంతో ఐటీ పన్నులు తప్పని పరిస్థితి తలెత్తింది.