రాజీవ్ సాగర్, ముజీబుద్దీన్, మంత్రి శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: స్త్రీ, శిశు, వికలాంగ, వయోజన సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీ వ్‌సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్‌పర్సన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్ల పదవీ కాలంతో వీరి నియామకాలను ప్రకటిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి.
►సూర్యాపేట జిల్లాకు చెందిన మేడే రాజీవ్‌సాగర్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశారు. 2006–2008 వరకు తెలం గాణ జాగృతి కోశాధికారిగా, 2008 నుంచి 2014 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
►కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్, బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. టీఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇదివరకు రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ గా, టీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్‌గా పదవులను నిర్వహించారు.
►మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన శ్రీదేవి బీఎస్సీ చదివారు.
Comments
Please login to add a commentAdd a comment