నెలకు లక్షల రూపాయల అద్దె
కనీస వసతులు మృగ్యం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
శాశ్వత భవనాలు నిర్మించాలని వేడుకోలు
రెండు నెలలుగా అద్దె చెల్లించని వైనం
హన్మకొండ చౌరస్తా : జిల్లాలో చాలా వరకు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నారుు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఖజానా నీళ్లలా ఖర్చవుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించడంలో అధికారులు విఫలమైతే.. పరిష్కారం ఉన్నా ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణితో ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానా భారీగా తరుగుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించి, ఐదేళ్లలోపు చిన్నారుల ప్రాథమిక అక్షరాభ్యాస కేంద్రంగా విశిష్ట సేవలందిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలు అమలవుతున్నా పక్కా భనాలు లేకపోవడంతో అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఉన్న భవనాల్లో కూడా వసతులు సక్రమంగా లేవు.
నెలకు అద్దె దాదాపు రూ.28 లక్షలు
జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వీటి పరిధిలో 4,523 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా కేవలం 825 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నారుు. మరో 807 సొంత బిల్డింగ్‌లు కాకుండా.. అటు అద్దె భవనాల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సముదాయాల్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాగా పట్టణ ప్రాంతాల్లో 327, గ్రామీణ ప్రాంతాల్లో 2,524 కేంద్రాలు అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నారుు. అంటే జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయన్న మాట. అద్దె భవనాలకు ప్రభుత్వం ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాటికి రూ.750, పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో కేంద్రానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తోంది. ఈ లెక్క ప్రకారం జిల్లావ్యాప్తంగా అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.28 లక్షలు అద్దె రూపేణా చెల్లిస్తోంది. అద్దె కేంద్రాలకు చెల్లించే డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో స్థలాన్ని కొనుగోలు చేసి భవనాలు నిర్మించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. అయితే అక్కడి స్థలాన్ని కొనుగోలు చేసి ప్రతి నెల నాలుగు నుంచి ఐదు కేంద్రాలను నిర్మించవచ్చని పలువురు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అద్దె భవనాలకు బదులు సొంత భవనాలు నిర్మించాలని పలువురు పేర్కొంటున్నారు.
అద్దె భవనాలతో అవస్థలు
నర్మెట : నా పేరు దన్నారపు శోభ, నేను నర్మెటలో అంగన్‌వాడీ కార్యకర్తగా ప నిచేస్తున్నా. 13 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మొదట్లో కిరాయి రూ.200 ఇచ్చే ది. ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఉంటే రూ.750 చెల్లిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలు దొరకడం లేదు.
ఏడాదిగా అద్దె రావడం లేదు..
కేసముద్రం : నా పేరు కవిత. నేను కేసముద్రం మండల కేంద్రంలోని శివారు కట్టుకాల్వతండాలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నా. ప్రభుత్వం నెలకు రూ.200 ఇస్తుంది. నేను రూ.300 కలిపి అద్దె ఇస్తున్నా. ఏడాదిగా అద్దె రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది.
ఏడేళ్లుగా అద్దె భవనంలోనే..
మహబూబాబాద్ : నా పేరు వసంత. నేను మానుకోట పట్టణంలోని కంకరబోడ్ ప్రాంతంలో నంబర్ 1 అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఏడేళ్లుగా అద్దె భవనంలోనే అవస్థలు పడుతున్నాం. మా కేంద్రంలో 74 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఫ్రీ స్కూల్ పిల్లలు 14 మంది.. టీహెచ్‌ఆర్ పిల్లలు 42 మంది.. గర్భిణులు, బాలింతలు 18 మంది ఉన్నారు. ప్రతి నెల ప్రభుత్వం అద్దె రూపంలో రూ.200 ఇస్తుండగా అదనంగా రూ.300 కలిపి ఇంటి యజమానికి చెల్లిస్తున్నాం. భవనంలో కూలిపోయే దశలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే బాగుంటుంది.
అద్దె దరువు
Published Fri, Aug 21 2015 1:57 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement