rental of buildings
-
భవనాలకు ని‘బంధనాలు’
- 119 బీసీ గురుకులాలకు లభించని అద్దె భవనాలు - మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించాలని యోచన సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకుల పాఠశాల లకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నా యి. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం గురుకుల పాఠశాలలను స్థాపిస్తోంది. ఈ పాఠశాలలను తొలుత అద్దె భవనాల్లో ఏర్పాటు చేసి తర్వాత దశలవారీగా శాశ్వత భవనాలు నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కొత్త గురుకులాలకు అద్దె భవనాలు లభించ డంలేదు. వచ్చే ఏడాది ఏర్పాటు కానున్న 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలు అన్వే షించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికా రులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో గురు కులంలో 5, 6, 7 తరగతులు, ఒక్కో తరగతి లో 80 మంది, మొత్తంగా 240 మంది విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో గురుకుల పాఠశాల ను 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఏర్పాటు చేయాలనేది నిబంధన. 12 తరగతి గదులు, 12 డార్మెటరీలు, చాలినన్ని టాయిలెట్లు, స్నానపుగదులు, కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, కార్యాలయ గది, స్టాఫ్ రూమ్, ఆటస్థలం.... ఇలా అన్ని సౌకర్యాలున్న భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. అత్తెసరు అద్దెకు... నిబంధనల్లో పేర్కొన్న భవనం దొరికితే విద్యార్థులకు సకల వసతులు సమకూరు తాయి. ఈ భవనానికి సబంధించి అద్దె చదరపు అడుగుకు రూ.3 చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. నిబంధనలకు తగినవిధంగా భవనాలు దొరకడంలేదని అధికారులు తలపట్టు కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పక్కపక్కనున్న రెండు, మూడు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలను కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పట్టణాల్లో మాత్రం అద్దె భవనాల లభ్యత గగనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 30 వరకు గురుకులాలు ఏర్పాటు చేస్తుండగా, భవనాల అద్దె చదరపు అడుగుకు రూ.20గా ఉంది. అద్దె భవనాలు లేకపోవడంతో మూతబడ్డ సంక్షేమ వసతిగృహాలవైపు అధికారులు దృష్టి సారిం చారు. ఈ మేరకు ఉన్నతాధికారులు జిల్లా సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
అద్దె భవనాలే ముద్దు
► కార్యాలయూలకు సొంత భవనాలు కరువు ► భవన నిర్మాణాలకు స్థలాలివ్వని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ► కీలక శాఖలన్నీ బాడుగ భవనాల్లోనే.. ► నగరంలోని విలువైన స్థలాలు అధికార పార్టీ నేతలకు ధారాదత్తం ► నోరు మెదపని ఉన్నతాధికారులు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయూలకు సొంత భవనాలు కరువయ్యూరుు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే మగ్గుతున్నారుు. నెలనెలా వివిధ ప్రభుత్వ శాఖలు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని బాడుగల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. భవనాలు నిర్మించుకునేందుకు స్థలాన్ని అడిగినా.. రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు స్థలాలు చూపించే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమి లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలను నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖాళీస్థలాల్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్నా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెడుతున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం స్థలాలు చూపించకపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల్లేవ్.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే ఎక్సైజ్ ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికీ సొంత భవనం లేదు. దీంతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సైతం సొంత భవనం లేదు. ఈ మూడు భవనాలకే నెలకు రూ.50 వేలకుపైనే బాడుగ చెల్లిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు, కొలతలు, రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు సైతం సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్-1, 2 కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఏపీఎంఐడీ కార్యాలయం పరిస్థితీ అదే. ఇక పురావస్తు శాఖ, కార్మికశాఖ, నె్రహూ యువ కేంద్రం, పరిశ్రమల ఇన్స్పెక్టర్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లింపు.. ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు తగ్గకుండా అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా కేంద్రంలోని అద్దె భవనాల్లో నడుస్తున్న కార్యాలయాలకే నెలకు రూ.లక్షల్లోనే అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేని చాలా శాఖలకు ప్రభుత్వం స్థలమిస్తే సొంత భవనాలను నిర్మించుకునే పరిస్థితి ఉంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి నగర పరిధిలోనే ప్రధాన కార్యాలయాలకుస్థలాలివ్వాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయంతో పాటు మండల కార్యాలయాలకు సైతం ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు ఇటీవల ప్రకటించారు. కానీ, ప్రభుత్వ కార్యాలయూలకు స్థలాల కేటారుుంపు ఊసెత్తలేదు. ఒంగోలు నగరంలోని విలువైన స్థలాలను రెవెన్యూ, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వకుండా అధికార పార్టీ ముఖ్యనేతలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 కోట్లు విలువైన బిలాల్‌నగర్ స్థలాన్ని నగరానికి చెందిన ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఈ స్థలాన్ని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ కోసం అధికారులు అడిగారు. అప్పట్లో ఈ స్థలం ఓ సొసైటీకి పట్టా ఇచ్చి ఉండటంతో అధికారులు ససేమిరా అన్నారు. ఆ తర్వాత సొసైటీకి ఇచ్చిన పట్టాను రద్దు చేసి తాజాగా ఆ స్థలాన్ని నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక అద్దంకి బస్టాండ్‌లో ఉన్న విలువైన స్థలాన్ని సైతం కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన పచ్చనేతకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సదరు నేత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సైతం చేపట్టారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ స్పందించి ఆ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడారు. దిబ్బలరోడ్డు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని ఓ నేత తనదంటూ ఏకంగా అధికారులకు భారీగా ముడుపులు అప్పగించి ఎన్ఓసీలు తెచ్చుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ అవినీతి బయటపడటంతో జిల్లా కలెక్టర్ పలువురు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ స్థలాన్ని సైతం నగర ముఖ్యనేత తన సమీప బంధువు హాస్పిటల్ కోసం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా గద్దలగుంటలోనూ ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నగరంలోని విలువైన స్థలాలను పచ్చనేతలు వరుసపెట్టి కబ్జా చేసేస్తున్నారు. అందిన కాడికి దండుకొని కొందరు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని విలువైన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాల్సి ఉంది. -
సంక్షేమ హాస్టళ్లకు కోత
పేద విద్యార్థులకు వాత హాస్టళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వ చర్యలు మండలానికో గురుకులం ఏర్పాటుకు కసరత్తు భవితవ్యంపై పేద విద్యార్థుల బెంగ పేద విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది. ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్ పాట పాడుతూ.. మరోవైపు సంక్షేమ వసతి గృహాలను తగ్గించే పనిలో పడింది. దీంతో చదువుకుందామని ఆశపడిన విద్యార్థులు భవితవ్యాన్ని తలుచుకుని దిగులుచెందుతున్నారు. మచిలీపట్నం : పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఆసరాగా ఉన్న సంక్షేమ వసతి గృహాలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వసతిగృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతుండడం గమనార్హం. మండలానికో గురుకులాన్ని ఏర్పాటుచేసి వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆసరా కోల్పోతారా జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 119 వసతి గృహాలున్నాయి. వీటిలో బాలురకు 65, బాలికలకు 54 ఉన్నాయి. 8548 మంది విద్యార్థులున్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న వసతిగృహాలు 32 ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4758 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో 11 వసతి గృహాలున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 11, బాలికల వసతి గృహాలు 7 చొప్పున మొత్తం 18 ఉన్నాయి. వీటిలో 1008 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో, తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను ఎంపిక చేసి వాటిని మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. తక్కువ మంది విద్యార్థులున్న వసతిగృహాలను గుర్తించి అన్ని సౌకర్యాలు ఉన్న సమీకృత వసతిగృహాల్లోకి ఈ విద్యార్థులను పంపనున్నారు. 50 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఖర్చు తగ్గించుకోవడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అక్కడ చేరేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వసతి గృహాలను మూసివేస్తూనే వాటి స్థానంలో గురుకులాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. గురుకులాల్లోనైనా వసతులు కల్పిస్తారో.. లేక గాలికొదిలేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న వసతిగృహాలు, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలు.. వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది... తదితర వివరాలను ఆయా సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వసతిగృహాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం పలు సూచనలు చేసిందని, ఆ మేరకు వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
అద్దె దరువు
నెలకు లక్షల రూపాయల అద్దె కనీస వసతులు మృగ్యం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత భవనాలు నిర్మించాలని వేడుకోలు రెండు నెలలుగా అద్దె చెల్లించని వైనం హన్మకొండ చౌరస్తా : జిల్లాలో చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నారుు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఖజానా నీళ్లలా ఖర్చవుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించడంలో అధికారులు విఫలమైతే.. పరిష్కారం ఉన్నా ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణితో ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానా భారీగా తరుగుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించి, ఐదేళ్లలోపు చిన్నారుల ప్రాథమిక అక్షరాభ్యాస కేంద్రంగా విశిష్ట సేవలందిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలు అమలవుతున్నా పక్కా భనాలు లేకపోవడంతో అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఉన్న భవనాల్లో కూడా వసతులు సక్రమంగా లేవు. నెలకు అద్దె దాదాపు రూ.28 లక్షలు జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వీటి పరిధిలో 4,523 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా కేవలం 825 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నారుు. మరో 807 సొంత బిల్డింగ్లు కాకుండా.. అటు అద్దె భవనాల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సముదాయాల్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాగా పట్టణ ప్రాంతాల్లో 327, గ్రామీణ ప్రాంతాల్లో 2,524 కేంద్రాలు అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నారుు. అంటే జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయన్న మాట. అద్దె భవనాలకు ప్రభుత్వం ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాటికి రూ.750, పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో కేంద్రానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తోంది. ఈ లెక్క ప్రకారం జిల్లావ్యాప్తంగా అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.28 లక్షలు అద్దె రూపేణా చెల్లిస్తోంది. అద్దె కేంద్రాలకు చెల్లించే డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో స్థలాన్ని కొనుగోలు చేసి భవనాలు నిర్మించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. అయితే అక్కడి స్థలాన్ని కొనుగోలు చేసి ప్రతి నెల నాలుగు నుంచి ఐదు కేంద్రాలను నిర్మించవచ్చని పలువురు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అద్దె భవనాలకు బదులు సొంత భవనాలు నిర్మించాలని పలువురు పేర్కొంటున్నారు. అద్దె భవనాలతో అవస్థలు నర్మెట : నా పేరు దన్నారపు శోభ, నేను నర్మెటలో అంగన్వాడీ కార్యకర్తగా ప నిచేస్తున్నా. 13 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మొదట్లో కిరాయి రూ.200 ఇచ్చే ది. ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఉంటే రూ.750 చెల్లిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలు దొరకడం లేదు. ఏడాదిగా అద్దె రావడం లేదు.. కేసముద్రం : నా పేరు కవిత. నేను కేసముద్రం మండల కేంద్రంలోని శివారు కట్టుకాల్వతండాలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నా. ప్రభుత్వం నెలకు రూ.200 ఇస్తుంది. నేను రూ.300 కలిపి అద్దె ఇస్తున్నా. ఏడాదిగా అద్దె రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఏడేళ్లుగా అద్దె భవనంలోనే.. మహబూబాబాద్ : నా పేరు వసంత. నేను మానుకోట పట్టణంలోని కంకరబోడ్ ప్రాంతంలో నంబర్ 1 అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఏడేళ్లుగా అద్దె భవనంలోనే అవస్థలు పడుతున్నాం. మా కేంద్రంలో 74 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఫ్రీ స్కూల్ పిల్లలు 14 మంది.. టీహెచ్ఆర్ పిల్లలు 42 మంది.. గర్భిణులు, బాలింతలు 18 మంది ఉన్నారు. ప్రతి నెల ప్రభుత్వం అద్దె రూపంలో రూ.200 ఇస్తుండగా అదనంగా రూ.300 కలిపి ఇంటి యజమానికి చెల్లిస్తున్నాం. భవనంలో కూలిపోయే దశలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే బాగుంటుంది. -
అమాత్యులే అతిథులు
మంత్రుల నివాసాలుగా అతిథిగృహాలు సబ్‌కలెక్టర్ కార్యాలయం, బరంపార్కులో సమావేశ మందిరాలు ఇప్పటికే పరిశీలించిన మంత్రులు అధికారుల కోసం అద్దె భవనాలు అన్వేషణ ఇక ప్రభుత్వ భవనాల్లోనే సమావేశాలు ఇన్నాళ్లూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సమావేశాలకు బ్రేక్ పడనుంది. ఇకపై ప్రభుత్వ భవనాలైన సబ్‌కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని ఒకటి రెండు అంతస్తులు, బరంపార్కులోని స్థలాలను సమావేశాలకు వినియోగిస్తారు. వివిధ శాఖలకు చెందిన కార్యాలయంలోని మీటింగ్ హాళ్లనే ఆయా మంత్రులు వినియోగించుకుంటారు. విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అతిథి గృహాలు అమాత్యుల నివాసాలుగా మారనున్నాయి. కొంతమంది మంత్రులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు నివసించేందుకు మాత్రం అనువైన భవనాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో అతిథిగృహాల(గెస్ట్‌హౌస్)కు కొద్దిపాటి మరమ్మతులు చేసి మంత్రులకు నివాసాలుగా కేటాయించాలని నిర్ణయించి నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ప్రకటించారు. బరంపార్కును పరిశీలించిన మంత్రులు మున్సిపల్‌మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిరోజులుగా మంత్రులకు అవసరమైన నివాసాల కోసం అన్వేషణ సాగిస్తున్న విషయం విదితమే. వారు ఇటీవీల విడివిడిగా బరంపార్కులోని రూమ్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అతిథిగృహాల సమచారం తెప్పించుకుని పరిశీలించారు. ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రుల నివాసాలకు తగినట్లుగా మరమ్మతులు చేపట్టారు. మిగిలిన అతిథిగృహాలను కూడా సాధ్యమైనంత త్వరలో అమాత్యుల నివాసాలుగా మార్చనున్నారు. అధికారుల కోసం ప్రయివేటు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు, కార్యదర్శి హోదా అధికారులకు అద్దె భవనాలు ఇవ్వనున్నారు. నగరంలో ఆకర్షణీయంగా, అందంగా ఉన్న ఇళ్ల కోసం ఇప్పటికే అధికారులు గాలిస్తున్నారు. భవనాలను అద్దెకు ఇచ్చే ఆలోచన ఉన్న వారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మిని సంప్రదిస్తే అద్దె గురించి చర్చిస్తారు. ప్రభుత్యోగులకు హడ్కో ఇళ్లు హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం హడ్కో 10 వేల ఇళ్లను రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ఇళ్లు తీసుకున్న ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌ను నేరుగా ఆ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హడ్కో నిర్ణయించిన వార్షిక లీజుకు, ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్సుకు ఏదైనా వ్యత్యాసం ఉంటే, దాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రెండు మూడు నెలలల్లో ప్రభుత్యోగులందరినీ విజయవాడ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తుచేస్తోంది. ఇందుకోసం ఒక అధికార కమిటీ కూడా వేస్తోంది. ఉద్యోగులను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తుంది. -
అద్దె కొంపల్లో అంగన్వాడీలు!
సొంత భవనాలు: 10,129 అద్దె భవనాలు: 34,116 ఏటా రూ.70 కోట్లు కిరాయి కింద చెల్లింపు హైదరాబాద్: అమ్మ ఒడికి దూరమైన చిన్నారుల కోసం ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాలు అద్దెకొంపల్లో అల్లల్లాడుతున్నాయి. కేంద్రమే సింహభాగం నిధులు సమకూరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చొరవ చూపకపోవటంతో కొత్త భవనాల నిర్మాణానికి దిక్కులేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 55,024 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 48,399 ప్రధాన అంగన్వాడీలు, 6,625 మినీ కేంద్రాలున్నాయి. ఇందులో 10,129 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 34,116 కేంద్రాలు అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. మరో 8,090 కేంద్రాలు రెంట్ ఫ్రీ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 73 శాతం భవనాలు అద్దె చెల్లింపు కింద నడుస్తున్నాయి. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఐసీడీఎస్ విభాగం నగరాల్లో రూ.3 వేలు చొప్పున, పట్టణాల్లో రూ. 1500, పల్లెల్లో రూ.500 వంతున అద్దె చెల్లిస్తోంది. అద్దెల కింద నెలకు సగటున రూ.5.79 కోట్లు అంగన్వాడీలకు చెల్లిస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం అద్దె కింద కడుతున్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కొన్నిటికి నేరుగా నిధులు మంజూ రు చే స్తుండగా, జిల్లా పరిషత్‌ల నుంచి 15 శాతం గ్రాంటు ద్వారా కొన్ని నిర్మిస్తున్నారు. జెడ్పీ సీఈవోల పర్యవేక్షణ కొరవడటంతో పేరుకు మాత్రమే కేటాయింపులు కనిపిస్తున్నాయి. నిర్మాణాలు మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. కలెక్టర్ల పర్యవేక్షణ లేకుంటే నిధులు పక్కదోవపడుతున్నాయి. చాలా చోట్ల మండల స్థాయికి వచ్చేసరికి మండలాధ్యక్షులు మొండి చేయి చూపుతున్నారు. తొంబై శాతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక సొంత భవనాలు ఉన్న అంగన్వాడీల్లో సగం కేంద్రాలు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
సొంత భవనాల్లేవ్!
ఆదిలాబాద్ : జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్ఆర్వోలు) ఉన్నాయి. ఖానాపూర్, లక్సెట్టిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 2007లో ఏర్పడగా, మిగతావి 1975-1980 మధ్య కాలం నుంచి ఉన్నాయి. ఏటా రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ప్రభుత్వానికి రూ.70 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. మంచిర్యాల కార్యాలయానికి మాత్రమే సొంత భవనం ఉండగా, మిగతావి ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. లక్సెట్టిపేట కార్యాలయం ప్రభుత్వ విశ్రాంతి గృహంలో కొనసాగుతుండగా, తాజాగా ఆ భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో అక్కడ కూడా అద్దె భవనం కోసం వెతుకుతున్నారు. తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పడంపై ఉద్యోగులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు. ఇరుకు భవంతులు ఆదిలాబాద్ బస్టాండ్ రోడ్డుకు సమీపంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. దీనికి రూ. నెలకు రూ.16,700 అద్దె చెల్లిస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉద్యోగులు కూర్చోవడానికే సరిగ్గా గదులు లేవు. ఉద్యోగులతోపాటు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లి రావాల్సిందే. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నిర్మాణం కోసం 2012లో రూ.75 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ కార్యాలయానికి సంబంధించిన స్థల వివాదం కారణంగా కాంట్రాక్టరు నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో నిధులు గతేడాది వెనక్కి మళ్లాయి. బోథ్ కార్యాలయానికి రూ.63 లక్షలు మంజూరు కాగా, అక్కడ గ్రామ పంచాయతీ స్థలం గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. అయితే భవన నిర్మాణం చేపట్టకపోవడంతో డబ్బులు వెనక్కి వెళ్లాయి. ప్రతి నెల రూ.3,250 అద్దె చెల్లిస్తున్నారు. భైంసాలో రూ.5,500, నిర్మల్ రూ.4 వేలు, ఆసిఫాబాద్‌లో రూ.9వేలు, ఖానాపూర్ రూ.2,200 అద్దె చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వానికి అత్యధిక ఆ దాయం ఇచ్చే శాఖల్లో ఒకటైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం చోద్యం.