
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
(చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..)
Comments
Please login to add a commentAdd a comment