సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద పిల్లలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నామని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రెట్టింపు పోషక ఆహారం అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల పేద పిల్లల కోసం అదనంగా 500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1800 కోట్ల రూపాయలతో పోషక ఆహారాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను 1400 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి పి1, పి2 విద్యా విధానాన్ని తెస్తున్నామన్నారు. పిల్లలకి ఎల్‌కేజీ, యూ కేజీ విద్యను అందిస్తామని, ఇది అంగన్వాడీ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పుగా దేశంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment