రెండు రోజుల్లో ‘తెలంగాణ’
Published Mon, Feb 17 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
మంత్రి గీతారెడ్డి వెల్లడి
జహీరాబాద్, న్యూస్‌లైన్: రెండు రోజుల్లో తెలంగాణ కల సాకారం కాబోతున్నదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్టం వచ్చిన అనంతరం యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. ఆరు దశాబ్దాల కాలంగా ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం సాగుతోందని, వేయి మందికి పైగా యువకులు బలిదానం చేశారని తెలిపారు. ఇక తెలంగాణ కల సాకారం కాబోతోందన్నారు. దీంతో బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. కాగా జహీరాబాద్ ప్రాంతంలో విద్యాభివ ృద్ధికి క ృషి చేస్తున్నట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ, ఉర్దూ మీడియం టీటీసీ కళాశాలలను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆశలను విద్యార్థులు కష్టపడి నెరవేర్చాలన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణు కూడా అలవర్చుకోవాలన్నారు. యువతే దేశానికి పట్టుగొమ్మలన్నారు. వచ్చే ఎన్నికల్లో పనిచేసే వారికే పట్టం కట్టాలన్నారు. ఐదు సంవత్సరాల కాలంగా జహీరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. డిగ్రీ కళాశాలకు వచ్చేందుకు రోడ్డు సదుపాయం లేనందున కొత్తగా రోడ్డు నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వక్తగా విచ్చేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజులతో పాటు లెక్చరర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement