డీఎస్ ఆశలపై నీళ్లు? | no hopes to ds in congress | Sakshi
Sakshi News home page

డీఎస్ ఆశలపై నీళ్లు?

Published Wed, Feb 26 2014 2:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

no hopes to ds in congress

 టీపీసీసీ పీఠం దక్కుతుందా!
 తెలంగాణకు సీఎం అవుతారా
 ఆందోళనలో అనుచరులు
 తెరపైకి వచ్చిన కేసీఆర్ పేరు
 రెండు పార్టీలలో జోరుగా చర్చ
 ఢిల్లీ పరిణామాలతో కలవరం
 
 కాంగ్రెస్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే పీసీసీ మాజీ చీఫ్‌ధర్మపురి శ్రీనివాస్ ఆశలు అడియాసలు కానున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో తొలుత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తర్వాత సీఎం కావాలనుకుంటున్న ఆయన కలలు కల్లలు కానున్నాయా? హైకమాండ్‌లో లాబీయింగ్ చేయగల సత్తా ఉన్నా.. ఆయనకు ఈసారి చుక్కెదురు కానుందా? అంటే... అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు, రాజకీయ విశ్లేషకులు.
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
 తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నేపథ్యం లో టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కన్నేసిన డి.శ్రీనివాస్ ఆ దిశ గా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించగలనన్న ధీమా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా, రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనంతరం కేసీఆర్‌కు ఆ పదవి కట్టబెడతారనే ప్రచారం డీఎస్‌సహా జిల్లాలోని ఆయన అనుచరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
 
 తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి కేసీఆర్ పేరు
 టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధినే త్రి సోనియాగాంధీ, తదితర నేతలను కలిసిన విషయం విదితమే. ఈ సందర్భంగా రకరకాల ఊహాగానాలకు తెరలేసింది. కీలక అంశాలపై చర్చించేం  దు   కు వెళ్లినట్లు కేసీఆర్ పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినా, తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపేందుకు కుటుంబసభ్యులతో వెళ్లి సోనియాను కలిసినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తె  లంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించేకంటే ముందు నుంచే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర కాం    గ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో చర్చనీయాంశంగా మారాయి.
 
 ప్రత్యక్ష ఎన్నికలలో చుక్కెదురే
 ప్రత్యక్ష ఎన్నికలలో డీఎస్‌కు పలుమార్లు చుక్కెదురైంది. పీసీ    సీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలకు సా    రథ్యం వహించిన ఆయనకు నామినేటెడ్ పదవులు, తెలంగాణ ఉద్యమం, బీసీ నేతగానే ఆయనకు హైకమాండ్‌పై     పట్టు చిక్కిందే తప్ప, ప్రత్యక్ష ఎన్నికలు అచ్చి రాలేదు. బ్యాం    కు ఉద్యోగిగా ఉన్న ఆయన 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో రాజకీయ అరంగేట్రం చేశారు. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లే గెలుపొం దారు. 1983లో తొలిసారే టీడీపీ అభ్యర్థి డి.సత్యనారాయణపై ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించారు. 1994లో సతీష్‌పవార్‌పై ఓటమిపాలైన డీఎస్, 1999, 2004లో వరుసగా గెలుపొం    దారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై ఓటమి చెందారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నిక య్యారు. ఇపుడు టీపీసీసీ పీఠంపై కన్నేశారు. తాజాగా తెరపైకి టీ ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేరు రావడంతో ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లేనన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement