కర్నూలు, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతానికి రెండు రాజధానులను ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూలులో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాజధానులు లేకపోతే సీమ ప్రజలు మరోసారి మోసపోక తప్పదన్నారు. 1953లో కర్నూలు రాజధానిని కోల్పోయిందన్నారు. లేనిపక్షంలో కోస్తా, సీమ రెండు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటుచేసి, ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.