'మాలో గుంతలు తవ్వితే తప్ప.. విభజన ఆగడం తథ్యం'
ఎవరైనా మాలో గుంతలు తవ్వితే తప్ప, రాష్ట్ర విభజన ఆగుతుందని అనుకుంటున్నాం అని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా తమ వ్యతిరేకతను రికార్డు చేసి పంపుతారు అని టీజీ తెలిపారు. బిల్లుపై చర్చ ప్రారంభమైంది అనడం కరెక్టుకాదు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371(డి)ని సవరించకుండా విభజించలేరు టీజీ స్పష్టం చేశారు. శాసన సభకు సీఎం వస్తారు.. వచ్చాక చర్చ ప్రారంభం అవుతుంది అని ఓ ప్రశ్నకు టీజీ సమాధానమిచ్చారు.
రేపు సభకు హాజరవుతానని సీఎం చెప్పారు అని టీజీ అన్నారు. బిల్లు పంపడానికి జనవరి 23వరకూ అవకాశం ఉంది, అవసరమైతే మరింత గడువు కోరతామని టీజీ మీడియాకు వెల్లడించారు. విభజన జరగదని మాకు చివరివరకూ ఆశ ఉంది మంత్రి టీజీ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు.