శాఖ మారిందని గోల చేయటం తగదు: టీజీ
కర్నూలు : మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. ఇష్టం లేకుంటే మిగిలిన తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాతే ముఖ్యమంత్రిని ప్రశ్నించాలన్నారు.
శ్రీధర్ బాబుకు ఇచ్చిన శాఖను విస్మరించి శాఖ మారిందని గోల చేయటం తగదని టీజీ వ్యాఖ్యానించారు. ఆయన సమర్థవంతంగా పనిచేయటం వల్లే శ్రీధర్ బాబుకు అదనపు శాఖలను కేటాయించటం జరిగిందన్నారు. మంత్రుల శాఖలను మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉందని, కిరణ్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని అన్నారు.