
సాక్షి, హైదారాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రముఖ హాస్యనటుడు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు చేదు అనుభవం మిగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాబుమోహన్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రముఖ జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతికిరణ్‌కు అవకాశం కల్పించారు. దీంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు నాయకుడికి అవకాశం దక్కినట్టు అయింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్న క్రాంతికుమార్ పలు టీవీ చానెళ్లలో పని చేశారు. ఇక, మరో విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి మరోసారి అవకాశం ఇచ్చారు.
మంత్రులుగా ఉన్న వారందరికి వారి సొంత నియోజకవర్గాల్లో సీట్లు ప్రకటించారు. ప్రముఖుల అసెంబ్లీ స్థానాలు
గజ్వేల్ - కేసీఆర్
సిరిసిల్ల-కేటీఆర్
సిద్దిపేట- హరీశ్‌రావు
సూర్యాపేట - జి. జగదీశ్ రెడ్డి
భూపాలపల్లి- మధుసుదనాచారి
బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment