సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారంరాత్రి ఇక్కడి రాజ్‌భవన్‌లో ఘనంగా విందు ఇచ్చారు. విందులో సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజే సేన్ గుప్తా, కేంద్రమంత్రి పురందేశ్వరి, జానారెడ్డి, గీతారెడ్డిలతోసహా పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రత్యేకంగా కొందరు ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారు. మాజీ గవర్నర్ రామ్మోహన్‌రావు, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్, లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి, స్పీకర్ మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణి, జానారెడ్డి, కావూరి సాంబశివరావు, రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, డీజీపీ బి. ప్రసాదరావులు సతీసమేతంగా వచ్చారు. మంత్రి గీతారెడ్డి పతీసమేతంగా హాజరయ్యారు. వీరందర్నీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో దోసకాయ పప్పు, పులిహోర, వె జి టబుల్ ధమ్ బిరియానీ వంటి శాకాహార వంటకాలను వడ్డించారు.
రాష్ట్రపతికి గవర్నర్ విందు
Published Wed, Dec 25 2013 1:55 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement