వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం!
వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం!
Published Wed, Jul 23 2014 7:37 PM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో చోటు చేసుకుంది. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ విందుకు కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
ఈ విందులో పలు రాజకీయపార్టీలకు చెందిన నేతలు పరస్పరం పలకరించుకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పీకర్ కోడెల, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మండలి చైర్మన్లు కూడా హాజరయ్యారు.
Advertisement
Advertisement