Iftaar party
-
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
వారికి మా పార్టీ అండగా ఉంటుంది
నిజామాబాద్ జిల్లా : గ్రామాభివృద్ధిపై మక్కువ ఉన్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అలాంటి వారికి మా పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పార్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, భూ ప్రక్షాళన పథకాలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ 15,700 మంది రైతులకు రూ.లక్షా యాభై వేల చొప్పున సాయం అందగా..85 శాతం రైతులకు ఏడు వేల రూపాయలకు తక్కువగా సాయం అందిందని తెలిపారు. సాయం అవసరం అయిన వారికి తక్కువగా, భూములను పెట్టుబడి కోసం కొన్న వారికి ఎక్కువ సాయం దొరికిందని విమర్శించారు. ఇట్లాంటి వ్యత్యాసం ఉంటే వ్యవసాయంలో ఎలా ముందడుగు పడుతుందని సూటిగా ప్రశ్నించారు. పోలీసు రిక్రూట్మెంట్లో తగ్గించిన వయో పరిమితి పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని కోదండ రాం డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం!
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో చోటు చేసుకుంది. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ విందుకు కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ విందులో పలు రాజకీయపార్టీలకు చెందిన నేతలు పరస్పరం పలకరించుకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పీకర్ కోడెల, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మండలి చైర్మన్లు కూడా హాజరయ్యారు. -
సల్మాన్-షారుఖ్ లు మరోసారి కలుసుకున్నారు!
ముంబై:బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ లు మరోసారి కలుసుకున్నారు. ఎప్పుడో 2008 లో బర్త్ డే పార్టీలో గొడవ పడిన వీరు ఎడమొహం-పెడమొహంగానే ఉంటూనే వస్తున్నారు. గత సంవత్సర రంజాన్ మాసం వేడుకల్లో తొలిసారి కలుసుకుని అందర్నీ ఆశ్చర్య పరిచారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసంలోనే కలుసుకున్నారు. బాంద్రా హోటల్లో ఆదివారం బాబా సిద్ధిఖి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వీరు హాజరైయ్యారు. తొలుత షారుఖ్ ఖాన్ కుటుంబం సమేతంగా ఇక్కడకు రాగా, సల్మాన్ ఖాన్ అరగంట ఆలస్యంగా తన సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్, తండ్రి సలీ ఖాన్ లతో ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. ఈ పార్టీలో షారూక్ కంటే కాస్తంత లేటుగా వచ్చిన సల్మాన్ అక్కడికు రాగానే అందరూ మర్యాద పూర్వకంగా లేచి నిలబడ్డారు. అక్కడే ఉన్న షారూఖ్ ని చూసిన సల్మాన్ ఒక్కసారిగా షారూఖ్ ని ఆలింగనం చేసుకున్నాడు. షారూఖ్ కూడా తన చిరకాల స్నేహితున్ని వాత్సల్యంతో గుండెకు హత్తుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ల మధ్య ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం 2008లో కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో గొడవ పడ్డారు. అప్పటి నుండి వారిద్దరి మధ్య మాటలే లేవు. అప్పట్లో ఈ సంఘటన పెద్ద దుమారమే రేపింది. -
ఇఫ్తార్ విందులో అరుదైన దృశ్యం