తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండ రాం
నిజామాబాద్ జిల్లా : గ్రామాభివృద్ధిపై మక్కువ ఉన్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అలాంటి వారికి మా పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పార్టీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, భూ ప్రక్షాళన పథకాలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ 15,700 మంది రైతులకు రూ.లక్షా యాభై వేల చొప్పున సాయం అందగా..85 శాతం రైతులకు ఏడు వేల రూపాయలకు తక్కువగా సాయం అందిందని తెలిపారు. సాయం అవసరం అయిన వారికి తక్కువగా, భూములను పెట్టుబడి కోసం కొన్న వారికి ఎక్కువ సాయం దొరికిందని విమర్శించారు. ఇట్లాంటి వ్యత్యాసం ఉంటే వ్యవసాయంలో ఎలా ముందడుగు పడుతుందని సూటిగా ప్రశ్నించారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో తగ్గించిన వయో పరిమితి పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని కోదండ రాం డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment