
సల్మాన్-షారుఖ్ లు మరోసారి కలుసుకున్నారు!
ముంబై:బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ లు మరోసారి కలుసుకున్నారు. ఎప్పుడో 2008 లో బర్త్ డే పార్టీలో గొడవ పడిన వీరు ఎడమొహం-పెడమొహంగానే ఉంటూనే వస్తున్నారు. గత సంవత్సర రంజాన్ మాసం వేడుకల్లో తొలిసారి కలుసుకుని అందర్నీ ఆశ్చర్య పరిచారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసంలోనే కలుసుకున్నారు. బాంద్రా హోటల్లో ఆదివారం బాబా సిద్ధిఖి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వీరు హాజరైయ్యారు. తొలుత షారుఖ్ ఖాన్ కుటుంబం సమేతంగా ఇక్కడకు రాగా, సల్మాన్ ఖాన్ అరగంట ఆలస్యంగా తన సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్, తండ్రి సలీ ఖాన్ లతో ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. ఈ పార్టీలో షారూక్ కంటే కాస్తంత లేటుగా వచ్చిన సల్మాన్ అక్కడికు రాగానే అందరూ మర్యాద పూర్వకంగా లేచి నిలబడ్డారు. అక్కడే ఉన్న షారూఖ్ ని చూసిన సల్మాన్ ఒక్కసారిగా షారూఖ్ ని ఆలింగనం చేసుకున్నాడు. షారూఖ్ కూడా తన చిరకాల స్నేహితున్ని వాత్సల్యంతో గుండెకు హత్తుకున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ల మధ్య ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం 2008లో కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో గొడవ పడ్డారు. అప్పటి నుండి వారిద్దరి మధ్య మాటలే లేవు. అప్పట్లో ఈ సంఘటన పెద్ద దుమారమే రేపింది.