
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మరణించిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆమె పెద్దకర్మ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.