రేపు మధ్యాహ్నం కేసీఆర్, చంద్రబాబు భేటీ | Chandrababu naidu, KCR to meet again tomorrow | Sakshi
Sakshi News home page

రేపు మధ్యాహ్నం కేసీఆర్, చంద్రబాబు భేటీ

Published Sat, Aug 16 2014 12:09 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

రేపు మధ్యాహ్నం కేసీఆర్, చంద్రబాబు భేటీ - Sakshi

రేపు మధ్యాహ్నం కేసీఆర్, చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : ఎట్టకేలకు ఇద్దరు చంద్రులు మరోసారి సమావేశం కానున్నారు. ఇందుకు రాజ్భవన్ వేదిక కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం భేటీ అవుతున్నారు. గవర్నర్ నరసింహన్ చొరవతో ఇద్దరు సీఎంలో కలవనున్నారు. రేపు మధ్యాహ్నం రాజ్భవన్లో జరగబోతుంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల స్పీకర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, అనేక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల విభజన, నీటి పంపకాలు, పీపీఏలు తదితర అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా  గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం రాజ్భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను తనకు ఇరువైపుల కూర్చొబెట్టుకుని వారితో గవర్నర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement