క్వారంటైన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ | Maharashtra Governor In Self Isolation | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కరోనా కలకలం

Published Sun, Jul 12 2020 12:09 PM | Last Updated on Sun, Jul 12 2020 12:31 PM

Maharashtra Governor In Self Isolation - Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో 18 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన వారిలో గవర్నర్‌తో సన్నిహితంగా మెలిగిన సిబ్బంది కూడా ఉన్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని నానావతి ఆస్పత్రికి తరలించిన అనంతరం గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వార్తలతో మహారాష్ట్రలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్‌-19 కేసులు ఏకంగా 2,50,000కు చేరువవడతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. కరోనా కట్టడికి పుణే జిల్లాలో జులై 13 నుంచి పదిరోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. థానే జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకూ పొడిగించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదైనవే. ఇక 49 జిల్లాల్లోనే 80 శాతం కరోనా వైరస్‌ కేసులున్నాయని కోవిడ్‌-19పై ఏర్పాటైన మంత్రుల బృందం పేర్కొంది. చదవండి :కోవిడ్‌-19 : మందుల కొరతకు చెక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement