photo credit: FACE BOOK.COM/ DPMUNDE
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కొవిడ్ సోనినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అయితే వైరస్ ఇన్‌ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ అన్నారు.
‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని పవార్ తెలిపారు.
‘కొవిడ్ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లో నుంచి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్ లక్షణాలు లేవు’ అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment