
రాజ్‌భవన్‌గా ఖరారైన విజయవాడలోని నీటి పారుదల శాఖ భవనం
సాక్షి, అమరావతి : విజయవాడలోని సూర్యారావుపేట పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..ఇక రాజభవన్‌గా వెలుగొందనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం గతంలో మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నర్సింహన్ వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ గత చంద్రబాబు సర్కారు గవర్నర్ కోసం రాజభవన్‌ను కూడా నిర్మించకపోవడంతో..గవర్నర్ విజయవాడకు వచ్చినప్పుడల్లా ప్రైవేట్ హోటల్లో బస చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకం జరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని రాజభవన్‌గా ప్రకటించడమే కాకుండా అందుకనుగుణంగా ఆ కార్యాలయాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు.