
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’)
అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.(చదవండి: ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ)
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆదిత్యానాథ్ దాస్
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే.