aditya nath das
-
Delhi: సీఎం జగన్ దినచర్య డైరీ.. ‘ప్రతి దినం ప్రజాహితం’ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించిన "ప్రతిదినం ప్రజాహితం" వికాస వార్షిక-4వ సంవత్సరం ముఖ్యమంత్రి రోజువారి కార్యక్రమలను తెలియజేసే దినచర్య డైరీని గురువారం ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్లో ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ సీఎం జగన్ రోజువారీ అధికారిక కార్యక్రమాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో, సంకలనం చేసిన విధానం, జాతీయ మీడియా సలహాదారు కార్యాలయం దానిని డైరీ రూపంలో ప్రచురించడం అభినందనీయం అని అన్నారు. తన కార్యాలయ రోజువారీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి దినచర్యను కూడా అనుసరిస్తూ ఒక బాధ్యతగా తీసుకుని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ డైరీ ని రూపొందించడం జరుగుతున్నది అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ డైరీ ముద్రణకు సహకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పుస్తక రచయిత పాలెపు రాజశేఖర్‌లను సలహాదారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ బీఎస్ రామకృష్ణ, ఎపీఆర్వో కే. గురవయ్య పాల్గొన్నారు. -
వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ ది బెస్ట్: ఆదిత్యనాథ్ దాస్
-
10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్‌తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. -
కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్
-
ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం కె.ఎస్ రామరావును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ: మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల నుంచి జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ని తప్పించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ లేఖ రాశారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొంది. సంబంధం లేని అంశాలని ప్రవీణ్ ప్రకాష్‌కి ఆపాదిస్తూ.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఎస్ఈసీ కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు. తన సిఫార్స్ లేఖలు పంపిన పలువురు ఉద్యోగులను సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఎస్ఈసీ తెలిపారు. అధికారులపై చర్యలు అంశం పొలిటికల్ ముఖ్య కార్యదర్శికి సంబంధం లేని విషయమని అధికారులు అంటున్నారు. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు ఈ నెల 23న కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చేశారని లేఖలో నిమ్మగడ్డ అబద్దపు ఆరోపణలు చేశారు. జీఏడీకి ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో ఎస్ఈసీ తెలపగా, సీఎస్‌కి రాసిన లేఖలతో జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఏ సంబంధముంటుదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఆయన విఫలమయ్యారని లేఖలో ఎస్ఈసీ పేర్కొనడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని, ఈ నెల 25 న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదంటూ ప్రవీణ్ ప్రకాష్ పై తప్పుడు ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు. -
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’) అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.(చదవండి: ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ) సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆదిత్యానాథ్ దాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే. -
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యానాథ్ దాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది. ఆదిత్యనాథ్ దాస్ బయోడేటా.. 1961లో బిహార్‌లో జన్మించిన ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి 1988లో ఏపీ ప్రభుత్వంలో కెరీర్ ప్రారంభించిన ఆదిత్యనాథ్ 1988లో విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నంద్యాల, విజయవాడలో సహాయ కలెక్టర్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1996 నాటికి కృష్ణా జిల్లా జేసీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1999లో వరంగల్ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం 2001లో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు 2006 వరకు ఢిల్లీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీలో పనిచేసి తిరిగి ఏపీలో పురపాలకశాఖ కమిషనర్&డైరెక్టర్‌గా బాధ్యతలు 2007లో యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్ తర్వాత ఐ అండ్ క్యాడ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ 2015లో వైఎస్ఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం అదే ఏడాది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆదిత్యనాథ్ దాస్ 2018 నాటికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆదిత్యనాథ్ దాస్ వైఎస్ గన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరులశాఖలో బాధ్యతలు ప్రస్తుతం పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం అదే హోదాలో ఉండగా నీలం సాహ్ని పదవీ విరమణ నేపథ్యంలో త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు -
ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం !
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ... నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారులు పి.వి.రమేష్, ఆదిత్యనాథ్ దాస్తోపాటు పలువురు సీనియర్లకు స్థానచలనం కలగనుంది. వారితో పాటు అజయ్ కల్లాంకు ఆర్థిక శాఖ... పి.వి.రమేష్‌కు ఆటవీశాఖ... లవ్ అగర్వాల్‌కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా కేటాయించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రకాశం జాయింట్ కలెక్టర్‌ను కూడా మార్చనున్నారు. -
గ్రౌండ్ వాటర్ డీడీపై నేడు, రేపు విచారణ
సాక్షి, కాకినాడ :అసిస్టెంట్ డెరైక్టర్లు, కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూగర్భ జల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం డిప్యూటీ డెరైక్టర్ ప్రసాదరావును విచారణాధికారిగా నియమిస్తూ ఆ శాఖ డెరైక్టర్ కె.వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరావు సోమ, మంగళవారాల్లో జిల్లాలో విచారణ చేపట్టనున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని ఏడీ కార్యాలయంలోను, మంగళవారం రాజమండ్రిలోను విచారణ జరపనున్నారు. జిల్లాలో ఈ శాఖ పరిధిలో ముగ్గురు ఏడీలు ఉండగా, ఇటీవల ఒకరు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. కాగా కాకినాడ ఏడీ విజయ్‌కుమార్‌ను కార్యాలయంలోకి రానివ్వకుండా తాళాలు వేయడంతోపాటు రాజమండ్రి ఏడీని కాకినాడలో డెప్యూటేషన్‌పై నియమించారు. వీరితోపాటు రాజమండ్రి, కాకినాడ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారంటూ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ రెండు కార్యాలయాల్లోని పలువురు సిబ్బంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీడీ వెంకటేశ్వరరావుపై ఈ విచారణ జరగనుంది.