సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.
ఆదిత్యనాథ్ దాస్ బయోడేటా..
- 1961లో బిహార్‌లో జన్మించిన ఆదిత్యనాథ్ దాస్
- 1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి
- 1988లో ఏపీ ప్రభుత్వంలో కెరీర్ ప్రారంభించిన ఆదిత్యనాథ్
- 1988లో విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు
- నంద్యాల, విజయవాడలో సహాయ కలెక్టర్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్
- 1996 నాటికి కృష్ణా జిల్లా జేసీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్
- 1999లో వరంగల్ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం
- 2001లో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు
- 2006 వరకు ఢిల్లీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్
- ఢిల్లీలో పనిచేసి తిరిగి ఏపీలో పురపాలకశాఖ కమిషనర్&డైరెక్టర్‌గా బాధ్యతలు
- 2007లో యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్
- తర్వాత ఐ అండ్ క్యాడ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్
- 2015లో వైఎస్ఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం
- అదే ఏడాది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆదిత్యనాథ్ దాస్
- 2018 నాటికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు
- చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆదిత్యనాథ్ దాస్
- వైఎస్ గన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరులశాఖలో బాధ్యతలు
- ప్రస్తుతం పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్
- ప్రస్తుతం అదే హోదాలో ఉండగా నీలం సాహ్ని పదవీ విరమణ నేపథ్యంలో త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు
Comments
Please login to add a commentAdd a comment