CHEIF SECRETARY
-
AP: ఈహెచ్ఎస్పై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్ జవహార్ రెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ అంశాల తోపాటు వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్లో మరిన్నీ అంశాలు చేర్చడం గురించి కూడా మాట్లాడారు. ఈమేరకు ఈహెచ్ఎస్లో ప్రస్తుతం ఉన్న కొన్ని ప్యాకేజీల ధరల పెంపు, ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్ పెంపు, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత, కేన్సర్ వంటి రోగాలకు పరిమితి లేకుండా అందించే అంశం, అలాగే 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులుకు వన్‌టైం మాస్టర్ హెల్త్ చెకప్ తదితర అంశాల గురించి సీఎస్ జవహార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అంతేగాదు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులుకు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్ జవహార్ రెడ్డి. కాగా, ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టీ.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్) డా.హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ) -
విజయవాడ సీపీగా కాంతి రాణా..
సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గతంలో విజయవాడ డీసీపీగా పని చేశారు. -
ఈ నెల 31లోగా.. పదోన్నతులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఈ నెలాఖరు వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతీ వారం (జనవరి 6, 12, 20, 27 తేదీల్లో) సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, పలువురు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు విభాగాధిపతు(హెచ్ఓడీ)లు, జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు సూచించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని, పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల ప్రకటనల్లో చేర్చాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం.. రాష్ట్ర, జోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల విభజన ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. ఇంకా కొన్ని శాఖలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని, సత్వరంగా ముగించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేశ్ చందా, అధర్ సిన్హా, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 7 లేదా 9న కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ! ► ఉద్యోగుల పదోన్నతులు, ధరణి సమస్యలే ప్రధాన ఎజెండా ►రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలపైనా చర్చకు అవకాశం ►నేడు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కె.చంద్రశేఖర్ రావు మళ్లీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 9 తేదీల్లో ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల ప్రభుత్వోద్యోగుల పదోన్నతులు, డీపీసీల ఏర్పాటుతోపాటు, ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారమే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకా లు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ, రైతు కల్లాలు తదితరవాటిపైనా కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశముందని సమాచారం. కాగా, ఈ అంశాలపై చర్చించి, పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లూ తమ జిల్లా కేంద్రాల నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని, బీఆర్కేఆర్ భవన్ నుంచి ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం కూడా పంపారు. -
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యానాథ్ దాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది. ఆదిత్యనాథ్ దాస్ బయోడేటా.. 1961లో బిహార్‌లో జన్మించిన ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి 1988లో ఏపీ ప్రభుత్వంలో కెరీర్ ప్రారంభించిన ఆదిత్యనాథ్ 1988లో విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నంద్యాల, విజయవాడలో సహాయ కలెక్టర్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1996 నాటికి కృష్ణా జిల్లా జేసీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1999లో వరంగల్ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం 2001లో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు 2006 వరకు ఢిల్లీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీలో పనిచేసి తిరిగి ఏపీలో పురపాలకశాఖ కమిషనర్&డైరెక్టర్‌గా బాధ్యతలు 2007లో యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్ తర్వాత ఐ అండ్ క్యాడ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ 2015లో వైఎస్ఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం అదే ఏడాది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆదిత్యనాథ్ దాస్ 2018 నాటికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆదిత్యనాథ్ దాస్ వైఎస్ గన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరులశాఖలో బాధ్యతలు ప్రస్తుతం పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం అదే హోదాలో ఉండగా నీలం సాహ్ని పదవీ విరమణ నేపథ్యంలో త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు -
పంజాబ్ చరిత్రలోనే తొలిసారిగా..
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన మొదటి మహిళగా విని మహాజన్ రికార్డు సృష్టించారు. కరణ్ అవతార్ సింగ్ స్థానంలో ఈమె నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన విని మహాజన్ శుక్రవారం పంజాబ్ సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసు, సివిల్ రంగాలకు నేతృత్వం వహిస్తున్నది మహాజన్ దంపతులే కావడం విశేషం. పంజాబ్ రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా భార్యే నూతన సీఎస్ విని మహాజన్. గత వారం రోజుల నుంచి ఈ నియామకంపై చర్చలు జరగ్గా రెండు రోజుల క్రితమే మహాజన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ ) అయితే దీని వెనుక భర్త దినకర్ గుప్తా లాబీయింగ్ ఉందన్న ఆరోపణలపై విని మహాజన్ ఘాటుగా స్పందించారు. డీజీపీ భార్య అయినంత మాత్రానా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా? దానికంటూ ఓ హోదా, అర్హత ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి ఇలా నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారంటూ మహాజన్ మండిపడ్డారు. అయితే 1987 బ్యాచ్‌కు చెందిన విని మహాజన్ ఆరుగురు ఇతర సహోద్యోగుల కంటే జూనియర్ కావడం గమనార్హం. రాష్ట్ర సీఎస్‌గా ఉన్న కరణ్ అవతార్ సింగ్ పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. అయితే గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కరణ్‌ని పదవిలోంచి తొలగించాలని పలువురు కేబినెట్ మంత్రులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో పదవీకాలం ముగియకుండానే ఆయన్ని తప్పించినా మరికొన్ని నెలల్లోనే ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ వాటర్ రెగ్యులేటరీ అథారిటీ చైర్పర్సన్ పోస్టుకు కరణ్ అవతార్ దరఖాస్తు చేస్తుకున్నట్లు తెలుస్తోంది. (అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు ) -
బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
-
బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లంకా వెంకట సుబ్రహ్మణ్యం (ఎల్వీ సుబ్రహ్మణ్యం) శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం ఒకటో బ్లాక్‌లోని సీఎస్ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఉ.10.30 గంటలకు వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతపై కొత్త సీఎస్ అధికారులతో సమీక్షించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. చదవండి....(ఏపీ సీఎస్ పునేఠపై సీఈసీ వేటు) -
ఏపీ సీఎస్ చంద్రా పునేఠా బదిలీ
-
ఏపీ సీఎస్‌పై బదిలీ వేటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్రా పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని పునేఠా అడ్డుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంలో పునేఠా విరుద్ద జీవోలు జారీచేశారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గినట్టు పునేఠాపై ఆరోపణలు ఉన్నాయి. కాగా,1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీలో అందరికంటే సీనియర్ అధికారి. ఎల్వీ సుబ్రహ్మణ్యం -
కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఆయన వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జైన్ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదోలుగుతున్నట్లు తన రాజీనామ లేఖలో పేర్కోన్నారు. అయితే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్ సాక్షి ఉండటంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రెండురోజుల క్రితమే జైన్‌ను సీఎస్ దాడి వ్యవహారంలో పోలీసులు విచారించారు కూడా. కాగా, గతనెల 22వ తేదీన ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ అన్షు పై ఆప్ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఎమెల్యేలు దాడి చేయటం చూశానని విచారణలో జైన్ తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సీఎం కార్యాలయానికి దూరంగా ఉంటున్న జైన్.. హఠాత్తుగా రాజీనామా చేయటం విశేషం. ఇప్పటికే వరుస ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న కేజ్రీవాల్‌కు.. ఇప్పుడు జైన్ రాజీనామా దిగ్భ్రాంతికి కలిగించేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రాజీవ్ శర్మ వారసుడు ఈయనేనా?
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, రాష్ట్రానికి కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారనే విషయం మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొత్త సీఎస్ గా ప్రదీప్ చంద్ర ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సీఎస్ పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా రాజీవ్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. -
గిరిజనుల ఆరోగ్యంపై అప్రమత్తం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకాధికారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ అధికారులను అదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం ఆర్అండ్బీ వసతి గృహంలో నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యంపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున జల కాలుష్యం కాకుండా తాగునీటిపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయి ఆరోగ్య కార్యకర్త నుంచి ఆశావర్కర్లు, ఆంగన్వాడీ సిబ్బంది వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున రోగాలు వ్యాప్తి చెందే అవకాశముందని, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటు కాలువల్లో పూడికలు తీయించాలన్నారు. ఈ సందర ్భంగా శ్రీకాకుళం నగరంలో చేపట్టిన కార్యక్రమాలను కమిషనర్ పి.ఎ.శోభ వివరించారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అక్టోబర్ 2న పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి మొబైల్æక్లినిక్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అంటువ్యాధులు లేవని చెప్పారు. డెంగీ జ్వర పీడితులు ఉంటే వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంతవరకు జిల్లాలో డెంగీ మరణాలు సంభవించలేదన్నారు. అనంతరం కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ప్రత్యేకాధికారిని కలిసి జిల్లాలో పరిస్థితులను వివరించారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు మెండ ప్రవీణ్, ధవళ భాస్కరరావు, ఎస్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'మాకు ఈ సాయం చేయండి.. చాలు'
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని డ్యాముల ద్వారా కిందికి వదిలే నీటిని తగ్గించే అవకాశం ఉంటే ఆమేరకు చర్యలు చేపట్టి తమకు పరోక్షంగా సహాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని వర్షాలు దానివల్ల పోటెత్తిన వరద నీటి గురించి ఆందోళన చెందిన చంద్రబాబు తమిళనాడుకు ఎలాంటి సహాయం అయినా చేస్తామని ప్రకటించారు. దీంతో చిత్తూరులో పిచ్ఛటూరు ఇతర డ్యాముల నుంచి కిందికి వదిలే నీటిని తగ్గించడం ద్వారా తమకు కొంత ఊరట నిచ్చినట్లవుతుందని, ఆ మేరకు సహాయం చేస్తే తాము సంతోషిస్తామని ఆయన అన్నారు. ఇలా చేయడం ద్వారా తిరువళ్లూరు జిల్లా వరద బారిన పడకుండా ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావుకు పోన్లో విజ్ఞప్తి చేశారు.