రాజీవ్ శర్మ వారసుడు ఈయనేనా?
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, రాష్ట్రానికి కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారనే విషయం మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొత్త సీఎస్ గా ప్రదీప్ చంద్ర ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సీఎస్ పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా రాజీవ్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు.