
అనిల్ చంద్రా పునేఠా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్రా పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని పునేఠా అడ్డుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంలో పునేఠా విరుద్ద జీవోలు జారీచేశారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గినట్టు పునేఠాపై ఆరోపణలు ఉన్నాయి. కాగా,1983 బ్యాచ్‌కు చెందిన ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఏపీలో అందరికంటే సీనియర్ అధికారి.
ఎల్‌వీ సుబ్రహ్మణ్యం
Comments
Please login to add a commentAdd a comment