Anil Chandra punetha
-
పదవీ విరమణ చేయనున్న మాజీ సీఎస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్ చంద్ర పునేతా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అనిల్ చంద్ర పునేతా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తేలడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ, అప్పుడు ఏపీ సీఎస్‌గా పని చేస్తున్న అనిల్ చంద్ర పునేతాను సీఎస్‌గా తప్పించిన సంగతి తెల్సిందే. అనంతరం ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఏపీ సీఎస్‌గా నియమించిన విషయం విదితమే. -
ఉన్నతాధికారులపై నిందలు హానికరం
తనకు అనుకూలంగా పనిచేస్తేనే సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం.. లేకపోతే అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం ఏపీ సీఎం చంద్రబాబుకు పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్నవిధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం తన అనుకూల మాధ్యమాలకు అలవాటు అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నించడం ఆయనకూ, అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన సీఎం వ్యక్తిగత స్థాయిని తుడిచిపెట్టేశాయి. నేను సర్వీసులో చేరిన కొత్తలో శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఎమ్మార్ పాయ్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్న ఆ రోజుల్లో నాటి సీఎం చెన్నారెడ్డి వారిని విస్మరించి వారి కన్నా సర్వీసులో జూనియర్ని చీఫ్ సెక్రటరీగా చేశారు. అపారమైన పరిపాలన అనుభవం నిజాయతీ, మంచితనం కలిగిన వ్యక్తి. పరిపాలన శిక్షణ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తూ మాకందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తన అనుభవాలను మాతో పంచుకుంటూ ఉండేవారు. వారు సర్వీస్‌లో చేరిన కొత్తలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది వివరిస్తూ, బెజవాడ గోపాలరెడ్డి లాంటి సీఎంలు తమవంటి కలెక్టర్లతో ఎంత మర్యాద పూర్వకంగా ప్రవర్తించేవారో చెప్తూ ఉండేవారు. మేము సర్వీసులో చేరేనాటికి ఈ ప్రమాణాలు చాలా తగ్గినప్పటికీ అధికారులకు, ప్రభుత్వ సర్వీసులకు చాలా విలువ ఉండేది. నేను విజయవాడ సబ్ కలెక్టర్‌గా పని చేసే రోజుల్లో చనుమోలు వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. అధికారులకు గౌరవం ఇవ్వటంలో, రాజకీయ సత్ప్రవర్తనలో ఆయనకు ఆయనే సాటి. ఆ కాలంలో ఎవరికో ఒకరికి సిమెంటు కేటాయించాలని సిఫార్సు చేశారు. అయితే ఆ వ్యక్తి అంతకుముందు నాతో ఎట్లా ప్రవర్తించిందీ వివరించి నిర్మొహమాటంగా ఇచ్చేది లేదని చెప్పాను. ఆ వ్యక్తికి ఏ స్థాయిలో అక్షింతలు పడ్డాయి అంటే రెండవ రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. ఆనాటికే దిగజారుడుగా మాట్లాడే చాలా మంది మంత్రివర్యులు ఉన్నా, చనుమోలు వెంకటరావు లాంటి మర్యాదస్తులేన రాజకీయ నాయకులు చాలా మందే ఉండేవారు. కాలక్రమేణా ఇది తగ్గుతూ వచ్చి ఈనాడు అధికారులు అంటే చులకన భావం రాజకీయ నాయకులలో జాస్తి అయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం అధికారులలో అవినీతి పెరగటం. అవినీతిపరుడైన అధికారిని ఏ విధంగా తమ లాభం కోసం ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు చూస్తారే కానీ అతనిని గౌరవంగా చూసే అవకాశం తక్కువ. అవినీతిపరుడైన అధికారికి రాజకీయ నాయకుడికి వ్యవస్థలో ఆత్మీయమైన అవినాభావ సంబంధంఉంటుంది. అవినీతిపరులైన అధికారుల సంఖ్య పెరగటంతో నీతిపరులైన అధికారుల అవసరం వ్యవస్థకు లేకుండా పోయింది. పరిపాలనా యంత్రాంగంలో నిలబడాలంటే అటువంటి అధికారులు కూడా కొంత సర్దుకొని పోవలసిన అవసరం ఏర్పడింది. చట్టాలు గుడ్డిగా ఉండటంతో అవినీతిపరులైన అధికారులు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నారు. విలువలకు ప్రాధాన్యమిస్తూ తప్పని పరిస్థితుల్లో ఫైళ్ల పైన కేవలం రూల్స్ పాటించకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులు దోషులుగా నిలబడుతున్నారు.. బలైపోతున్నారు. ఇక అధికారులు చులకన కావడానికి మరొకప్రధాన కారణం.. విలువ లేని వ్యక్తులు రాజకీయాలలో ఉన్నత స్థానాల్లోకి రావటం. అడ్డదారిలో డబ్బులు చేసుకొని డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకునే ఈ చౌకబారు రాజకీయ నాయకులకు ఉచ్చ నీచాలు తెలియటం లేదు. నడమంత్రపు సిరి లాగా నడమంత్రపు అధికారం చేతిలోకి రాగానే కొందరు రాజకీయ నాయకులకు కళ్ళు నెత్తికి ఎక్కటం సహజం. ఈ మధ్య ఒక మంత్రివర్యులు ఒక విశ్రాంత అధికారిని ఉద్దేశించి ఉద్యోగంలో ఉన్నప్పుడు గాడిదలు కాచారా అనటం ఇందుకు నిదర్శనం. ఈ రెండు ప్రధాన కారణాల దృష్ట్యా ఈనాడు అధికారులు రాజకీయ నాయకుల దృష్టిలో చులకన అయిపోతున్నారు. మూడవ కారణం.. భారత రాజ్యాంగంలో అధికార వ్యవస్థను రాజకీయ ప్రమేయం లేని తటస్థ వ్యవస్థగా పొందుపరిచారనే ప్రధాన అంశాన్ని మర్చిపోయి కొందరు అధికారులు ఒక పార్టీకో, పార్టీ నాయకులకో కొమ్ముకాయడం. దీనివలన అధికార వ్యవస్థ నిలువుగా చీలి రాజ్యాంగంలో పొందుపరచిన తటస్థ వ్యవస్థకు బదులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న టఞౌజీlటటyట్ట్ఛఝ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాజకీయ నాయకత్వం మార్పు జరగ్గానే అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయి కొత్తవారు పదవిలోకి రావటం దీనికి నిదర్శనం. అటువంటి సమయంలో తటస్థ అధికార విధానానికి అర్థం లేకుండా పోతుంది. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని టఞౌజీlటటyట్ట్ఛఝను ప్రవేశ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ నాటకాలకు అవసరం లేకుండా గెలుపొందిన పార్టీకి అనుకూలంగా వారి సలహాదారులు వస్తారు. సలహా ఇస్తారు. వారితోపాటే నిష్క్రమిస్తారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకులు, అధికారుల సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన కాలక్రమేణా మార్పు. ఈ సాధారణ అంశాలకు సంబంధం లేకుండా గత వారంలో అధికారులను చులకన చేసి ఏపీ సీఎం రెండు సందర్భాలలో మాట్లాడారు, ప్రవర్తించారు. ఎన్నికల నిర్వహణ తేదీ కన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇటువంటి విషయాలకు సీఎంలు సాధారణంగా ఒక సీనియర్ నాయకుడిని పంపించడం పరిపాటి. అంతేకాకుండా ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక సాధారణమైన నాయకుడు కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా కీర్తిని గడించిన నాయకుడు. మమతా బెనర్జీలాంటి నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ధర్నా చేయడం ముఖ్యమంత్రిగా ధర్నాకు దిగటం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ చంద్రబాబులాంటి లబ్ధప్రతిష్టులు ఈ రకంగా చేయటం వారి స్థాయికి తగదు. ఇంతేకాక ప్రధాన ఎన్నికల అధికారిని దోషిగా చూపెడుతూ ‘మీ కార్యాలయమే మూసుకోవచ్చు కదా’ అన్న ధోరణిలో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి సీఎం హోదాను గౌరవించి చాలా సభ్యతతో, పద్ధతిగా ప్రతిస్పందించారు. సీఎం హోదాను, గౌరవాన్ని కాపాడారు. గట్టిగా సమాధానం చెప్పి సహేతుకంగా వాదనలు వినిపించి ఉంటే ముఖ్యమంత్రి గారి హోదాకు భంగం కలిగి ఉండేది. దురదృష్టం ఏమిటంటే ఆయన నమ్రతను, సభ్యతను బలహీనతగా చిత్రీకరిస్తూ ఏదో తప్పు చేశాడు కాబట్టి సీఎంకి సమాధానం చెప్పలేదు అంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని కొనసాగించి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం. ఇక ఎన్నికలు అయిన రెండవ రోజు సీఎం ఏకంగా ప్రధాన కార్యదర్శినే లక్ష్యంగా చేసుకుని తన విమర్శలు సంధించారు. ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నిస్తూ ఈవీఎంల విషయం ప్రస్తావన చేస్తూ ప్రధానకార్యదర్శి అంశం కూడా లేవనెత్తారు. తాను నియమించిన ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత్‌ని తొలగించి మరొకరిని ముఖ్య కార్యదర్శిగా ఎన్నికల సంఘం ఎట్లా నియమిస్తుంది అని ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత జగన్‌తో పాటు సహ నిందితుడు అనీ, అటువంటివారిని ప్రధాన కార్యదర్శి ఎట్లా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా చంద్రబాబు మర్చిపోయిన విషయం ప్రధాన కార్యదర్శి మార్పుకు ఎవరైనా కారణం అయితే అది తానుమాత్రమే. ఎన్నికల షెడ్యూలు విడుదల తరువాత అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం అధీనంలోకి వస్తుందని తెలిసి కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి బేఖాతర్ చేసే విధంగా సీఎం నిర్దేశించారు. వారి ఆంతరంగిక అధికార వర్గం ఈ విషయంలో సరైన విధి విధానాలను సీఎంకు వివరించ కుండా ఆయన అభిప్రాయానికే వత్తాసు పలికారు. ఇటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రధాన కార్యదర్శి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అందువల్లనే ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించుకుని అన్ని విధాల అర్హుడైన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం అర్హతల ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని విధాల అర్హులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అర్థరహిత అనవసర అభాండాలు వేయడం ఆయన స్థాయికి తగని పని. మనకు అనుకూలంగా పనిచేస్తేనే నిష్పాక్షిక సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం లేకపోతే అసమర్థులుగా అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం సీఎంచంద్రబాబుకి పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్న విధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం ఆయన అనుకూల మాధ్యమాలకు పరిపాటి అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నిచడం ఆయనకు, ఆయన అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రధాన కార్యదర్శి విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా చాలా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన వారి వ్యక్తిగత స్థాయిని ఒక్క పెట్టుతో తుడిచి వేశాయి. దీనికి కారణం ఆయన నిజమైన వ్యవహారశైలి.. తను కష్టపడి ప్రపంచానికి ప్రదర్శించిన కృత్రిమ వ్యవహార శైలి కన్నా పూర్తిగా భిన్నంగా ఉండటమా? లేక ఎన్నికలలో పరాజయ సంకేతాలు రావటంతో ఏర్పడిన నిరాశ నిçస్పృహలా? వేచి చూడాలి. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ మెయిల్ : iyrk45@ gmail. com -
చంద్రబాబు ఒకరిని బలిపశువును చేశారు..
సాక్షి, అమరావతి: బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని, ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం నిందితుడు కాదంటూ 2018 జనవరిలోనే ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయన్నారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని తెలిపారు. ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారన్నారు. (చదవండి: సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు) -
బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
-
బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లంకా వెంకట సుబ్రహ్మణ్యం (ఎల్వీ సుబ్రహ్మణ్యం) శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం ఒకటో బ్లాక్‌లోని సీఎస్ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఉ.10.30 గంటలకు వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతపై కొత్త సీఎస్ అధికారులతో సమీక్షించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. చదవండి....(ఏపీ సీఎస్ పునేఠపై సీఈసీ వేటు) -
బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త సీఎస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కీలకమైన సమయం అన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీస్‌లో ఇదో కొనసాగింపు మాత్రమేనని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. -
ఏపీ సీఎస్ పునేఠపై సీఈసీ వేటు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. తాము తొలగించిన ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును తిరిగి అదే పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం ఒత్తిళ్ళకు లొంగిపోయి వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. వెంకటేశ్వరరావును వెనకేసుకొస్తూ, ఈసీ చర్యను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకెళ్లడాన్ని సీరియస్‌గా తీసుకుంది. సీఎస్‌గా పునేఠను తప్పించింది. అంతేకాదు ఎన్నికల విధులకు ఆయన్ను దూరంగా ఉంచాలంటూ ఆదేశించింది. 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పునేఠకు తదుపరి పోస్టింగ్‌పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. ఒత్తిళ్లకు లొంగినందుకే.. ఇంటెలిజెన్స్ డీజీ.. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా జారీ చేసిన జీవోను, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగిపోయి రద్దు చేయడం.. పునేఠ మెడకు చుట్టుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ఏజెంటుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వెంకటేశ్వరరావును తిరిగి అదే పదవిలో నియమిస్తూ పునేఠ మరో జీవో జారీ చేశారు. అంతేకాదు ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పరిణామాలన్నిటినీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒక అధికారిని వెనుకేసుకు రావడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఆయన్ను ఆ పదవి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించకుండా కొనసాగించుకోవాలని భావించిన ఏపీ ముఖ్యమంత్రి.. ఆ మేరకు ఒత్తిడి తెచ్చి సీఎస్‌తో జీవోలు జారీ చేయించారని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈసీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ జీవో ఇచ్చిన నేపథ్యంలో పునేఠను పిలిపించిన కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. ఏబీని బదిలీ చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి? ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం వెనుక మతలబు ఏమిటి? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకోవడంతో పాటు పునేఠను కూడా వాకబు చేసింది. సీఎం ఒత్తిడికి లొంగిపోయి తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిని సీఎస్ స్థానంలో ఉంచితే కమిషన్ చులకనవుతుందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే పునేఠపై చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఆయన సీఈసీ పరిధిలోకి రారంటూ డీజీపీ పంపిన ఫైల్ మేరకు సీఎస్ పునేఠ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ‘ఎవరు ఎన్నికల పరిధిలోకి వస్తారో? ఎవరు ఎన్నికల నిర్వహణ విధుల పరిధిలోకి రారో మాకు తెలియదా? తెలియకుండానే ఉత్తర్వులు జారీ చేయడానికి మాకేమైనా చట్టం తెలియదా? మీరు చెబితే మేం తెలుసుకోవాలా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్‌ను తప్పించి ఏకే మహంతిని డీజీపీగా నియమించిన విషయం పునేఠకు తెలియదా? తెలిసీ కమిషన్ నిర్ణయాన్ని ఉల్లంఘించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సీఎస్ పదవి అంటే సీఎం అడుగులకు మడుగులొత్తుతూ పక్షపాతంగా వ్యవహరించడమా?..’ అన్నరీతిలో కమిషన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం రాజకీయ స్వార్థానికి పునేఠ బలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ స్వార్థానికి పునేఠ బలయ్యారని ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ‘కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్‌దేవ్ శర్మలను బదిలీ చేస్తూ పునేఠ జీవో నంబరు 716 జారీ చేశారు. తర్వాత సీఎం ఒత్తిళ్లతో ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారంటూ జీవో నంబరు 721 జారీ చేశారు. ఆ వెంటనే డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దుచేస్తూ.. డీజీ ఇంటెలిజెన్స్గానే కొనసాగుతారంటూ జీవో 720 జారీ చేశారు. సీఎం ఒత్తిడి చేసినప్పుడు నిక్కచ్చిగా వ్యవహరించకుండా లొంగిపోయి తప్పుచేయడంవల్లే పునేఠ పదవి పోయింది. నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు రావచ్చు...’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. ఈసీకి ఏపీ డీజీపీ వివరణ వెంకటేశ్వరరావు బదిలీ రద్దు వ్యవహారంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలోనే.. మొదట పునేఠాను పిలిచి వివరణ కోరిన ఈసీ తర్వాత డీజీపీని పిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీజీపీ ఢిల్లీలో ఈసీని కలిసే ముందే ఆయన్ను ఏసీబీ డీజీ విధుల నుంచి తప్పిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. కాగా గురువారం ఢిల్లీ వెళ్లిన డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం ముంగిట వివరణ ఇచ్చారు. అయితే ఈసీ ఫుల్ బెంచ్ లేదని, ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు లేకపోవడంతో శుక్రవారం రావాలని డీజీపీకి ఈసీ ఆదేశించింది. దీంతో గురువారం రాత్రి ఢిల్లీలోనే ఉండిపోయిన ఆయన శుక్రవారం మరోమారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ కమిషనర్లు అశోక్ లావాస్, సుశీల్ చంద్రలను కలిసి వివరణ ఇచ్చారు. డీజీపీగాను, ఏసీబీ డీజీగాను రెండు విధులు నిర్వహించిన మీరు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా జీవో ఇవ్వడం కోసం సీఎస్‌పై ఒత్తిడి తెచ్చి ఎందుకు నోట్‌ఫైల్ ఇవ్వాల్సి వచ్చిందని వారు డీజీపీని ప్రశ్నించినట్టు సమాచారం. ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినప్పటికీ ఆయన అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా డీజీపీని ఈసీ వివరణ కోరినట్టు తెలిసింది. -
ఏపీ సీఎస్ చంద్రా పునేఠా బదిలీ
-
ఏపీ సీఎస్‌పై బదిలీ వేటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్రా పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని పునేఠా అడ్డుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంలో పునేఠా విరుద్ద జీవోలు జారీచేశారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గినట్టు పునేఠాపై ఆరోపణలు ఉన్నాయి. కాగా,1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీలో అందరికంటే సీనియర్ అధికారి. ఎల్వీ సుబ్రహ్మణ్యం -
ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని తాము జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయనను తిరిగి అదే పదవిలో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేత జీవో జారీ చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 716ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? తిరిగి ఆయననే డీజీ ఇంటెలిజెన్స్‌గా నియమిస్తూ జీవో 720 ఎందుకు జారీ చేశారు? ఎన్నికల కమిషన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘించడాన్ని ఎలా పరిగణించాలి? అని ఈసీ ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేతను ఈసీ వివరణ కోరింది. దీంతో అనిల్‌చంద్ర పునేత సోమవారం ఢిల్లీలో ఈసీని కలిసి వివరణ ఇచ్చారు. ‘కమిషన్ ఆదేశాలు వచ్చిన తక్షణమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, రాహూల్ దేవ్ శర్మను బదిలీ చేస్తూ జీవో నంబరు 716 జారీ చేశాం. తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) పంపిన నోట్ ఫైల్ మేరకే జీవో 721 జారీ చేశాం. దీని ప్రకారమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేసి మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు జీవో నంబరు 720 జారీ చేశాం ’ అని సీఎస్ అనిల్‌చంద్ర పునేత వివరణ ఇచ్చినట్లు తెలిసింది. డీజీపీ నోట్ ఫైల్ పంపితే ఆ విషయం మా (ఈసీ) దృష్టికి తీసుకొచ్చి అనుమతి తీసుకోకుండా బదిలీ ఉత్తర్వులను ఎలా రద్దు చేస్తారు? డీజీపీగానీ, మరొకరుగానీ ఏది చెబితే అది చేసేస్తారా? ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఎలా సవాల్ చేస్తుంది? అని ఈసీ నిలదీసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా జీవో ఇవ్వడం తొందరపాటు చర్యేనని, ఇకమీదట ఇలా జరగనీయబోమంటూ సీఎస్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును బదిలీచేసిన ప్రభుత్వం 24 గంటలు గడవకముందే ఆయనను తిరిగి అదే స్థానంలో నియమించడం, కమిషన్ నిర్ణయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో సవాల్ చేయడం ఈసీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించడమే కాకుండా ఈసీ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ వివరణ అడగడంతోపాటు ఇందుకు దారితీసిన పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కమిషన్ అధికారులు వాకబు చేసినట్లు సమాచారం. -
ప్రధాన కార్యదర్శి లేకున్నా తండ్రీ కొడుకులకు ఓకే..!
సాక్షి, అమరావతి : రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కలిసి నిర్వహిస్తుండడం మంత్రుల్లో, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు గత నెల 9వ తేదీన, ఈ నెల 6వ తేదీన ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించారు. పలు ఐటీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా భారీ రాయితీలు ఇచ్చేశారు. ఎస్‌ఐపీబీకి కన్వీనర్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఈ రెండు సమావేశాలకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎస్ఐపీబీ సమావేశాలంటే పెదబాబు, చినబాబుల ఇష్టారాజ్యంగా మారిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుబాటులో ఉండి కూడా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి లేకుండా ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేవని అధికారులు గుర్తుచేస్తున్నారు. వచ్చే పదేళ్లపాటు పలు ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఎస్ఐపీబీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఎస్‌ఐపీబీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా ఆర్థిక, రెవెన్యూ, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, ఇంధన శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఉంటారు. సభ్య కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 20న జీవో నం.51 జారీ చేసింది. అయితే, ఫిబ్రవరి 9న నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు మాత్రమే పాల్గొన్నారు. మిగతా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొనలేదు. అలాగే ఈ నెల 6న నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదు. మిగతా సభ్యులైన మంత్రులు కూడా హాజరు కాలేదు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ మాత్రమే పాల్గొన్నారు. సమావేశం కంటే ముందే నిర్ణయాలు ఎన్నికల ముందు హడావిడిగా ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నందువల్లే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి హాజరుకాలేదని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎవరికి, ఏ కంపెనీలకు ఏ ధరకు భూములు ఇవ్వాలి, ఎన్ని రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించేస్తున్నారని, తరువాత ఎస్ఐపీబీ సమావేశం ఏర్పాటుచేసి అందులో ఆమోదింపజేస్తున్నారని, అలాంటి సమావేశాలకు వెళ్లడం కంటే దూరంగా ఉండటమే మేలని మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు హాజరుకావడం లేదని తెలుస్తోంది. -
లక్ష్య సాధనకు నిరంతర కృషి
సాక్షి, అమరావతి: విభజన తర్వాత రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పదవిని సమర్థంగా నిర్వహించడం సవాలు వంటిదని అనిల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. దినేష్ కుమార్ నుంచి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠ మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికి 34 ఏళ్ల ఉద్యోగ జీవితం పూర్తయి 35వ ఏట సర్వీసులో అడుగుపెట్టాను. 2015 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశాను. నా సేవలను గుర్తించి అత్యంత బాధ్యతాయుతమైన సీఎస్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉంది. నాపై మరింత గురుతర బాధ్యత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదాయాన్ని, సంతోష సూచికను పెంచాలి. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పథకాల ఫలితాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. ప్రతిదానిని సమీక్షించి లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. టీమ్‌వర్క్‌తో రాష్ట్ర పగతికి పాటుపడతాం’ అని పునేఠ వివరించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించి తద్వారా రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామన్నారు. తొలిపోస్టింగ్‌లోనే అత్యంత ఆనందం ‘నా ఉద్యోగ జీవితంలో సంతోషం కలిగించిన, ఆనందం మిగిల్చిన పనులు అనేకం ఉన్నాయి. చెప్పాలంటే అన్నీ సంతోషం కలిగించాయి’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పునేఠ జవాబిచ్చారు. అన్నింటికంటే ఎక్కువ ఆనందం, సంతృప్తి కలిగించింది ఏమిటని ప్రశ్నించగా.. ‘వైఎస్సార్ జిల్లా రాజంపేటలో సబ్ కలెక్టరుగా నేను ఉద్యోగ జీవితం ఆరంభించాను. ఆ తర్వాత పలు జిల్లాల్లో కలెక్టరుగాను, వివిధ శాఖల్లో కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పనిచేశాను. రాజంపేటలో సబ్ కలెక్టరుగా ఉన్నప్పుడు నాకు వచ్చిన వినతుల్లో ఒక్కటి కూడా పెండింగ్‌లో పెట్టకుండా అందరికీ సాధ్యమైన మేలు చేయడం నాకు అత్యంత మరపురాని ఆనందం మిగిల్చింది. ఇంటి స్థలాల కోసం అర్జీలిచ్చిన ప్రతి ఒక్కరికీ ఐదు సెంట్ల స్థలానికి పట్టాలిచ్చాను. వ్యవసాయ భూమి కోసం దరఖాస్తు చేసిన వారికి 3 నుంచి ఐదు ఎకరాల చొప్పున భూమి పట్టాలు ఇచ్చాను’ అని పునేఠ గుర్తు చేసుకున్నారు. కాగా, సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో అనిల్ చంద్ర పునేఠ ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పటాన్ని పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించారు. అనంతరం దినేష్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠను దినేష్ కుమార్ ఆలింగనం చేసుకుని అభినందించారు. -
వివాదాస్పదంగా మారిన ఏపీ సీఎస్ నియామకం
-
వివాదాస్పదంగా మారిన ఏపీ సీఎస్ నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియామకం వివాదాస్పదంగా మారింది. సీనియరిటీని పక్కకుపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లలో 1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం అందరికంటే సీనియర్ అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు సీఎస్‌గా అవకాశం ఇవ్వలేదు. ఆయనను కాదని.. 1984 బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్రను సీఎస్‌గా నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు ఎల్వీ సుబ్రమణ్యంకు అవకాశం ఇవ్వలేదు. ఈ విధంగా సీనియర్ అధికారులను అవమానించడంపై ఏపీలోని ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాగా, ఆదివారం ఏపీ నూతన సీఎస్‌గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనిల్ చంద్ర 2019 మే 31వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన పునేత
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్‌ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. ప్రజల సంతోషం, ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం కృషి చేస్తాననని పునేత చెప్పారు. టీం వర్క్‌తో ముందుకు వెళ్తు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. 2019 మే 31వరకు అనిల్ చంద్ర పునేత సీఎస్‌గా కొనసాగనున్నారు. -
ఏపీ కొత్త సీఎస్‌గా అనిల్ చంద్ర పునేత నియామాకం
-
స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేఠ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ మాట్లాడారు. వంద శాతం సర్వే పూర్తి చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అ«ధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పేర్లు నమోదు చేసుకోని ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 72 శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందన్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు నమోదు చేసుకుని, వారి కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లను అందుబాటులో ఉంచి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం
విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు. -
ఇద్దరు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు
హైదరాబాద్: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాకు కమిషనర్ అప్పీల్స్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డికి సర్వే అండ్ సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డెరైక్టరుగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలిచ్చారు. -
అంతా గోప్యం!
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆ శాఖాధికారులతో గుట్టుగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. లోపాలు బయటపడతాయనో మరే కారణమో తెలియదు గానీ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. లోపలికి వెళ్లిన ఒకరిద్దరు మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించేశారు. సుమారు రెండుగంటల పాటు పునేఠా వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. డొల్లతనం బయటపడుతుందనే... వ్యవసాయాధికారుల డొల్లతనం బయటపడుతుందనే మీడియాను లోపలికి అనుమతించలేదనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. పాత్రికేయులు సమావేశంలో ఉంటే లోపాలను ఎత్తిచూపుతారని, బండారం బయటపడుతుందనే భావనతో లోపలికి అనుమతించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదే విధంగా పంట నష్టం అంచనా వేయడంలోనూ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రాజకీయ సిఫారసులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పొలంబడి, వర్మీకంపోస్టు యూనిట్ వంటి పథకాలు తీరు ఆధ్వానంగా ఉంది. దీనికి తోడు వీటన్నింటి గురించి అధికారులను ప్రశ్నిస్తే పత్రికలు, మీడియాలో వస్తుం దని ఆందోళనతో ఈ సమీక్షను మీడియా ప్రతి నిధులకు ప్రవేశం నిరాకరించినట్టు తెలిసింది. అధికారులపై ఆగ్రహం పథకాల నిర్వహణ, ఇతర విషయాల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై పునేఠా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ పథకం ద్వారా గత ఏడాది ఏయే కార్యక్రమలు నిర్వహించారని ఆత్మ పీడీ రాజబాబుని ముఖ్యకార్యదర్శి పునేఠా ప్రశ్నించారని, దీనికి సరైనా ఆయన సమధానం చెప్పలేనట్టు తెలిసింది. అదేవిధంగా రైతు శిక్షణ కేంద్రం ద్వారా గత ఏడాది ఎంత మందికి శిక్షణ ఇచ్చారని , ఏయే అంశాలపై శిక్షణ ఇచ్చారని డీడీ ఆశాదేవిని ప్రశ్నించగా ఆమె కూడా సరైన సమాధానం చెప్పలేకపోయినట్టు తెలిసింది. దీంతో వీరిద్దరిపై పునేఠా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిర్లక్ష్యంగా పనిచేస్తే సహించేదిలేదని, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని, మొక్కుబడిగా పనిచేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. మొక్కుబడి పర్యటనలను మాని రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, వ్యవసాయశాఖ అనగానే రైతులకు అండగా ఉంటుందనే భావనను తీసుకురావాలని చెప్పారు.