
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కీలకమైన సమయం అన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీస్‌లో ఇదో కొనసాగింపు మాత్రమేనని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment